ఏపీలో జిల్లా పరిషత్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ల ఎన్నిక జరగనుంది. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు జడ్పీటీసీలు సమావేశమై జడ్పీ ఛైర్మన్, వైస్ ఛైర్మన్లు, కో ఆప్టెడ్ సభ్యులను ఎన్నుకోనున్నారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు వీలుగా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే ఆయా పదవులకు అభ్యర్థులను ఖరారు చేసిన వైసీపీ… ఎన్నిక కోసం విప్ జారీ చేయనుంది.
రాష్ట్రంలో అన్ని పరిషత్ కార్యాలయల్లో సమావేశం కానున్న జడ్పీటీసీలు..ఛైర్మన్, వైస్ ఛైర్మన్లను ఎన్నుకోనున్నారు. అభ్యర్థల నుంచి ఉదయం 10 గంటలలోపు నామినేషన్లు స్వీకరించనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఉపసంహరణకు అవకాశం కల్పించారు. అనంతరం కో-ఆప్టెడ్ సభ్యుల ఎన్నిక చేపట్టనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు జడ్పీ ఛైర్మన్, ఇద్దరు వైస్ ఛైర్మన్ల ఎన్నిక కోసం ప్రత్యేక సమావేశం నిర్వహించి ఎన్నుకోనున్నారు.
ఇది కూడా చదవండిః వెదర్ అలర్ట్ః ఏపీలో మూడు రోజులు భారీ వర్షాలు