Home ఆంధ్ర‌ప్ర‌దేశ్ KNL | వాడి వేడిగా జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం…

KNL | వాడి వేడిగా జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం…

0

కర్నూల్ బ్యూరో : జిల్లా పరిషత్ సమావేశ హాల్లో ఆదివారం జడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి అధ్యక్షతన వాడివేడిగా కొన‌సాగుతోంది. గ్రామీణ నీటి సరఫరా-పారిశుద్ధ్యం, పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ శాఖ, విద్యుత్తు శాఖ తదితర అంశాలపై నిర్వహిస్తున్న జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం కొనసాగుతోంది. ఉమ్మడి కర్నూలు, నంద్యాల జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి టి.జి. భరత్ హాజరయ్యారు.

ఈ సమావేశానికి పత్తికొండ ఎమ్మెల్యే కె.ఈ.శ్యామ్ బాబు, పాణ్యం శాసనసభ్యులు గౌరు చరిత, కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, కురువ రాష్ట్ర చైర్మన్ దేవేంద్రప్ప, వాల్మీకి కార్పొరేషన్ ఛైర్పర్సన్ కప్పట్రాళ్ల బొజ్మమ్మ, కర్నూలు జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా, నంద్యాల జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి గణియా, ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి, నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య, కర్నూలు జాయింట్ కలెక్టర్ డా.బి.నవ్య, కర్నూలు, నంద్యాల జిల్లాల జడ్పీటీసీలు, ఎంపీపీలు, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version