ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ ట్రిబ్యునల్ స్టాండింగ్ కౌన్సిల్ గా ఎం.జాఫర్ హుస్సేన్ బేగ్ ను నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు ముఖ్య పరిపాలన అధికారి ఎల్.అబ్దుల్ ఖాదర్ నియామక ఉత్తర్వులు ఇచ్చారు. ఈయన 1999 సంవత్సరంలో న్యాయవాదిగా ఎన్ రోల్ మెంట్ అయ్యి కర్నూలు దివంగత సీనియర్ న్యాయవాది జి.నాగలక్ష్మి రెడ్డి వద్ద శిష్యరికం చేశారు. అనతి కాలంలోనే సివిల్ కేసులను వాదించి కర్నూలులో పేరు తెచ్చుకున్నారు.
దాదాపు 24సంవత్సరాల సుదీర్ఘ అనుభవంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ ట్రిబ్యునల్ స్టాండింగ్ కౌన్సిల్ గా 8 జిల్లాలైన అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలకు నియమించారు. ఈయన నియామకం పట్ల కర్నూలు జిల్లా న్యాయవాదుల సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నాగభూషణం నాయుడు, చక్రపాణి సీనియర్ న్యాయవాదులు ఎదిరే శ్రీనివాసులు సత్యారెడ్డి, జి.చలపతిరావు, ఏ.అనిల్ కుమార్, షకీల్ అహమ్మద్ లు సంతోషం వ్యక్తం చేశారు.