Saturday, November 23, 2024

Yuva galam – ప్రజావేదిక శిథిలాలే సైకో పాలనకు సమాధిరాళ్లు – నారా లోకేష్

తాడేపల్లి, (ప్రభ న్యూస్) – టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువ గళం పాదయాత్ర ఉమ్మడి గుంటూరు జిల్లాలో పూర్తిఅయింది.188 వ రోజు ఉండవల్లి మాజీ ముఖ్యమంత్రినారా చంద్రబాబు నాయుడు నివాసం వద్ద నుండి లోకేష్ పాదయాత్ర మొదలు పెట్టారు. అక్కడ లోకేష్ మట్లాడుతూ, .ప్రజావేదిక శిథిలాలే సైకోపాలనకు సమాధిరాళ్లుని నారా అన్నారు.జగన్ సైకోయిజానికి ప్రత్యక్షసాక్షి ఉండవల్లిలోని ప్రజావేదిక. అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో 2019 జూన్ 25న మొదలైన కూల్చివేతల పర్వం ఇప్పటికీ కొనసాగుతూనే ఉందని 51నెలల రాక్షస పాలనలో గూడు కోల్పోయిన లక్షలాది పేదల కన్నీరు దావానలంగా మారుతోంది. ఏ విధ్వంసంతో నువ్వు పాలన ప్రారంభించావో అక్కడి నుంచే నీ పతనం ప్రారంభం కాబోతోందని అన్నారు.

ఈ ప్రజావేదిక శిథిలాలే మరో 9 నెలల్లో నీ అరాచక ప్రభుత్వానికి సమాధిరాళ్లు కాబోతున్నాయి…రాసి పెట్టుకో జగన్మోహన్ రెడ్డీ?! అంటూ సవాల్ విసిరారు

.కొండవీటి వాగు వద్ద లోకేష్ కు బోట్ అసోసియేషన్ ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు.వైసిపి ప్రభుత్వం లో తాము నష్టపోయిన తీరును వివరిస్తూ గజమాల ఏర్పాటు చేశారు.తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి తమకు పూర్వవైభవం తీసుకొచ్చే చర్యలు తీసుకోవాలంటూ కృష్ణా నదిలో పడవల ప్రదర్శన నిర్వహించారు.దార్శనిడుకు చంద్రబాబునాయుడు ముందుచూపునకు నిదర్శనం కొండవీటివాగు ఎత్తిపోతల పథకం. రాజధాని ప్రాంతంలో కొండవీటి వాగు ముంపు సమస్య శాశ్వత పరిష్కారానికి మాజీముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రూ.222 కోట్లతో ఈ ఎత్తిపోతల పథకాన్ని నిర్మించారని, రికార్డు సమయంలో కేవలం 18నెలల్లో పూర్తిచేసి 2018 సెప్టెంబర్ 16న రాష్ట్రప్రజలకు అంకితం చేశారు. ఒకేరోజు ఒక టీఎంసీ నీళ్లు వచ్చినా సమర్థవంతంగా వరదను నివారించే విధంగా ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారని లోకేష్ అన్నారు.

దివాలాకోరు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ప్రధాన ప్రాజెక్టుల గేట్లకు గ్రీజు పెట్టలేక రైతాంగాన్ని వరదల్లో ముంచెత్తుతున్నాడని అన్నారు.

- Advertisement -

నారా లోకేష్ పాదయాత్ర 2500 కి.మీ. మైలురాయిని చేరుకుంది. .మంగళగిరిలో 20వేల ఇళ్ల నిర్మాణానికి శిలాఫలకం రాష్ట్రంలో అరాచకపాలనపై సమరభేరి మోగిస్తూ 5కోట్ల ప్రజల జనగళమే యువగళమై సాగుతున్న చారిత్రాత్మక యువగళం పాదయాత్ర శనివారం మంగళగిరి నియోజకవర్గం ఉండవల్లిలో 2500 కి.మీ.ల మైలురాయి చేరుకోవడం సంతోషంగా ఉందని నారా లోకేష్ అన్నారు.

అధికారంలోకి వచ్చాక నియోజకవర్గంలో ఇళ్లులేని 20వేల మంది నిరుపేదలకు ఇళ్లు నిర్మిస్తానని హామీ ఇస్తూ శిలాఫలకం ఆవిష్కరించాననీ,. దీంతోపాటు అసైన్డ్, కొండ, వాగు, అటవీ, రైల్వే, ఇతర భూముల్లో నివసిస్తున్న పేదల ఇళ్లను క్రమబద్దీకరించి పట్టాలు అందజేస్తానని నేను మాట ఇస్తున్నాను అని తెలిపారు.

గుంటూరు నుంచి కృష్ణా జిల్లాలో కి…

యువ గళం పాద యాత్ర గుంటూరు నుంచి కృష్ణా జిల్లాలో కి ప్రవేశించింది. .ప్రకాశం బ్యారేజివద్ద ఉమ్మడి గుంటూరు జిల్లా నేతలు వీడ్కోలు పలికారు.భారీగా తరలివచ్చిన జనంతో జనసంద్రంగా ప్రకాశం బ్యారేజి పరిసరాలు మారాయి. ప్రకాశం బ్యారేజీ మీద యువ నేత నారా లోకేష్ కి ఉమ్మడి కృష్ణా జిల్లా నాయకులు ఘనస్వాగతం పలికారు.

ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నక్క ఆనందబాబు,మాజీ ఎమ్మెల్యేలుజీవి ఆంజనేయులు, తెనాలి శ్రావణ్ కుమార్, యరపతినేని శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ, టిడిపి నాయకులు పోతినేని శ్రీనివాసరావు,నందం అబద్దయ్య,తమ్మిశెట్టి జానకి దేవి, ఆకుల జైసత్య, ఆరుద్ర భూలక్ష్మి, టిడిపి తాడేపల్లి పట్టణ అధ్యక్షులువల్లభనేని వెంకటరావు, మండల అధ్యక్షులు అమరా సుబ్బారావు, కొల్లి శేషు, దారా దాసు, జంగాల సాంబశివరావు, కొమ్మారెడ్డి కిరణ్, జంగాల వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement