Friday, November 22, 2024

Yuva Galam – విదేశీ విద్య పథకాన్ని పునరుద్ధరించండి… నారా లోకేష్ కు కాపు దళం వినతి

మంగళగిరి రూరల్ ఏప్రిల్ 17 ప్రభ న్యూస్… టిడిపి. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాపు సామాజిక వర్గ యువకులకు విదేశాల్లో చదువుకునేందుకు విదేశీ విద్య పథకాన్ని పునరుద్ధరించాలని ఆ సామాజిక వర్గ నాయకులు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను కోరారు. కాపులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలంటూ గురువారం డాన్ బాస్కో పాఠశాలలో కాపు దళం నేతలు లోకేష్ కు వినతిపత్రం సమర్పించారు. సుమారు 30 వేల మంది ఓటర్లు ఉన్నప్పటికీ మంగళగిరిలో కమ్యూనిటీ హాల్ లేదని నియోజకవర్గంలో కాపు కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి చొరవ చూపాలని కోరారు. టిడిపి హయాంలో ఇచ్చిన ఐదు శాతం రిజర్వేషన్లను పునరుద్ధరించాలని ఈ సందర్భంగా విన్నవించారు. కాపు కార్పొరేషన్ ను పునరుద్ధరించి సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలని కాపు యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని అన్నారు.

యువతీ, యువకులకు మెరుగైన ఉపాధి అవకాశాల కోసం శిక్షణ ఇప్పించాలని, రైతులకు సబ్సిడీ రుణాలు వ్యవసాయ యంత్రాల మంజూరుకు నిధులు కేటాయింపునకు కృషి చేయాలని కోరారు. ఆయా సమస్యల పరిష్కారానికి టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తగు చర్యలు తీసుకుంటానని, కాపు సామాజిక వర్గ సంక్షేమానికి కట్టుబడి ఉంటారని లోకేష్ హామీ ఇచ్చినట్లు కాపుదలు నేతలు తెలిపారు. కాపుదనం మంగళగిరి నియోజకవర్గ కన్వీనర్ రంగశెట్టి నరేంద్ర, టిడిపి మంగళగిరి పట్టణ ఉపాధ్యక్షులు గోవాడ దుర్గారావు, రాష్ట్ర తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి ఆకుల జయసత్య, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సుంకర రఘుపతిరావు, అమరావతి రైతు జేఏసీ నాయకులు ఆకుల ఉమామహేశ్వరరావు కాపు సంఘ నాయకులు విన్నకోట శ్రీనివాసరావు, తోట సాంబశివరావు, వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పుప్పాల కోటేశ్వరరావు, కాపు దళం సభ్యులు కుసుమ,నరేష్ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement