Sunday, November 17, 2024

MPTC, ZPTC Elections Result: షరిషత్ ఫలితాల్లోనూ ఫ్యాన్ గాలి

ఏపీలో మంగళవారం ఎన్నికలు జరిగిన 10 జెడ్పీటీసీ, 123 ఎంపీటీసీ స్థానాల్లోనూ అధికార వైసీపీ సత్తా చాటింది. ఈ రోజు ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా.. ఫలితాల్లో వైసీపీ హవా కొనసాగింది.

కృష్ణా జిల్లా విస్సన్నపేట జడ్పీటీసీ ఓట్ల లెక్కింపులో వైసీపీకి అత్యధిక ఓట్లు వచ్చాయి. మొదట లెక్కించిన పోస్టల్ బ్యాలెట్లలో వైసీపీ అత్యధికత సంపాదించింది. ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి ఒక్క ఓటుకు కూడా నమోదు కాకపోవడం గమనార్హం. మొత్తం పోలైన ఓట్లు-32లలో వైసీపీ-14, బీఎస్సీ -6, బీజేపీ-1, సీపీఎం-3, చెల్లని ఓట్లు -8 వచ్చాయి.

కర్నూలు జిల్లా ఫలితాల్లో అధికార పార్టీ వైసీపీ సత్తా చాటుతోంది. కర్నూలు జిల్లాలో ఏడు ఎంపీటీసీ స్థానాలలో వైసీపీ అభ్యర్థులు గెలిచారు. చాగలమర్రి, టి.గోకులపాడు, చాకరాజువేముల, ధనపురం, మల్లెపల్లి,  బైచిగేరి, హానవాలు ఎంపీటీసీ స్థానాలలో వైసీసీ గెలిచింది.

శ్రీకాకుళం జిల్లాలోని కుంబరినువంగా ఎంపీటీసీలో టీడీపీ అభ్యర్థి గెలుపు పొందగా.. కంచిలి మండలం తలతంపర ఎంపీటీసీలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి విజయం సాధించారు.  అలాగే కవిటి మండలం కొజ్జిరియా, సీతంపేట-2 స్థానాల్లో వైస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్ధులు గెలిచారు.

కాగా,

- Advertisement -

రాష్ట్రంలో నవంబర్ 16న 10 జెడ్పీటీసీ, 123 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మొత్తం 14 జడ్పీటీసీల్లో 4 ఏకగ్రీవం కాగా.. 10 స్థానాలకు పొలింగ్ జరిగింది. 176 ఎంపీటీసీ స్థానాల్లో 50 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన స్థానాల్లో ఎన్నికలు నిర్వహించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement