ఆంధ్రప్రదశ్ లో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ జరుగుతోంది. ఓట్ల లెక్కంపులో తొలి ఫలితం వెల్లడైంది. ఈ కౌంటింగ్ లో అధికార వైఎస్ఆర్సీపీ బోణీ కొట్టింది. ఏపీ సీఎం జగన్ సొంత జిల్లా వైఎస్సార్ కడపలోని కమలాపురం మునిసిపాలిటీ వైసీపీ కైవసం చేసుకుంది. మొత్తం 20 వార్డులకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో వైసీపీ 12 వార్డుల్లో విజయం సాధించింది. కమాలపురంలో ని 11వ వార్డులో వైసీపీ అభ్యర్థి సలీల 250 ఓట్ల తేడాతో విజయం సాధించింది. కమలాపురం 15వార్డులో వైఎస్సార్సీపీ అభ్యర్థి చవారెడ్డి సంధ్యారాణి 129 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి