అనంతపురం జిల్లా పెనుకొండలో వైసీపీ విజయదుందుభి మోగించింది. మొత్తం 20 వార్డులకు గాను 18వ వార్డులో గెలుపొందింది. రెండు వార్డులలో మాత్రమే టిడిపి విజయం సాధించింది. ఇది ప్రజా విజయమని వైసీపీ నేతలు చెబుతుండగా, అధికారాన్ని అడ్డం పెట్టుకుని దొంగ ఓట్లు వేసుకొని విజయం సాధించారని టిడిపి విమర్శిస్తోంది.
పెనుగొండ నగర పంచాయతీ ఎన్నికలలో వైసిపికి చెందిన 9వ వార్డు అభ్యర్థి 437 ఓట్లు,10వ వార్డు అభ్యర్థి 358 ఓట్లు,11వ వార్డు అభ్యర్థి 44 ఓట్లు,12వ వార్డు అభ్యర్థి 186 ఓట్లు 5వ వార్డు అభ్యర్థి 374 ఓట్లు, 6వ వార్డు అభ్యర్థి 288 ఓట్లు, 7వ వార్డు అభ్యర్థి 301ఓట్లు, 8వ వార్డు అభ్యర్థి 259 ఓట్లు, 2వ వార్డు 472 ఓట్లు, 4వ వార్డు 192 ఓట్లు, టిడిపికి చెందిన 1వ వార్డు అభ్యర్థి 152 ఓట్లు, 3వ వార్డు అభ్యర్థి 175 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కాగా, పెనుకొండ నగర పంచాయతీ ఎన్నికల్లో జనసేన బిజెపి సిపిఐ సిపిఎం తదితర పార్టీలు తమ అభ్యర్థిని నిలబెట్టి నప్పటికీ.. వారి ప్రభావం ఎక్కడా కనిపించలేదు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి