రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు తుది గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో వైఎస్సార్సీపీ శ్రేణులు సంబరాలు నిర్వహించారు. టపాసులు పేల్చి, మిఠాయి తినిపించుకున్నారు. తిరుపతిలోని రైల్వే కాలనీలో ఆదివారం ఉదయం ఉత్తర విభాగ వైఎస్సార్సీపీ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం అనంతరం వివిధ కార్యక్రమాలను చేపట్టారు. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డితో కలిసి వైఎస్సార్సీపీ నగర కమిటీ అధ్యక్షుడు పాలగిరి ప్రతాప్ రెడ్డి నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రతాప్ రెడ్డి మాట్లాడారు.
కొత్త జిల్లాల ఏర్పాటు తో రాష్ట్రంలో పాలనతో రాష్టంలో సరికొత్త శకానికి నాంది పలికారన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలన ప్రజారంజకంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం కోట్లాది రూపాయలు వెఛ్చి స్తున్నారని తెలిపారు. అయితే ప్రతిపక్ష నాయకుడు ఓర్వలేక విమర్శిస్తున్నారని దుయ్యబట్టారు. పేదల సంక్షేమాన్ని చంద్రబాబు పట్టించుకోలేదన్నారు. అందుకే చంద్రబాబును ప్రజలు పట్టించుకోవడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ డాక్టర్ శిరీష, డిప్యూటీ మేయర్లు ముద్ర నారాయణ, భూమన అభినయ్ పాల్గొన్నారు.