Tuesday, November 26, 2024

ఆ ముగ్గురి అవసరం ఏపీ ప్రజలకు లేదు: వైసీపీ ఎంపీ

టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లపై వైఎస్ఆర్సీపీ ఎంపీ నందిగం సురేష్ విమర్శలు గుప్పించారు. చంద్రబాబు, నారా లోకేష్, పవన్‌ కల్యాణ్‌.. రాష్ట్రానికి టూరిస్టులుగా వచ్చిపోతున్నారని అన్నారు. ఈ ముగ్గురి అవసరం రాష్ట్ర ప్రజలకు లేదని చెప్పారు. అందుకే రాష్ట్రంలో ఎన్నికలు జరిగే ప్రతీసారీ ఆ రెండు పార్టీలను ప్రజలు చిత్తుచిత్తుగా ఓడిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రానికి పర్యాటకులుగా మారిన ఈ ముగ్గురు నాయకులను ప్రజలు మరోసారి ఛీ కొట్టారని అన్నారు. బద్వేలు ఉప ఎన్నికతో ఈ విషయం మరోసారి నిరూపితమైందని చెప్పారు.

చంద్రబాబు కుటుంబసభ్యుల ఓట్లు కుప్పంలో లేవన్నారు. చుట్టం చూపుగా రాష్ట్రానికి వచ్చే వారిని ప్రజలు నమ్మరని చెప్పారు. బద్వేల్‌ తీర్పుతో చంద్రబాబు మైండ్‌ బ్లాక్‌ అయిందన్నారు. చంద్రబాబు పరోక్షంగా సహకరించడం వల్లే బద్వేల్ ఎన్నికల్లో బీజేపీకి 21 వేల ఓట్లు వచ్చాయని తెలిపారు. ఎన్నికకు దూరం అంటూనే బీజేపీ మద్దతు పలికి తన బుద్ధి ఏమిటో స్పష్టం చేశాడని దుయ్యబట్టారు. సీఎం వైఎస్‌ జగన్ ఓటు పులివెందులలో ఉంటే.. చంద్రబాబు, లోకేశ్ ఓట్లు హైదరాబాద్లో ఉన్నాయన్నారు.

రాష్ట్రాభివృద్ధికి చంద్రబాబు ప్రధాన అడ్డంకిగా మారాడని నందిగం సురేష్ విమర్శించారు. ఆయన ఏ రకంగా ఆటంకం కలిగిస్తున్నారో ప్రజలందరికీ తెలుసని అన్నారు. అమరావతి శాశ్వత రాజధానిగా సీఎం నిర్ణయం తీసుకున్నారని తలిపారు. అన్ని ప్రాంతాలతోపాటే అమరావతిని అభివృద్ది చేస్తారని చెప్పారు. అమరావతి రైతులను రెచ్చగొట్టి చంద్రబాబు పాదయాత్ర చేయిస్తున్నారని మండిపడ్డారు. ఈ యాత్ర రాయలసీమ నుంచి కూడా వెళ్తుంది. వారికి ఏమి సమాధానం చెప్తారని సురేష్‌ ప్రశ్నించారు.

ఇది కూడా చదవండి: పులుల వేటపై మరింత నిఘా.. దీపావళి తర్వాత యాక్షన్ ప్లాన్..

Advertisement

తాజా వార్తలు

Advertisement