వైఎస్ఆర్సీపీలో విషాదం చోటుచేసుకుంది. కృష్ణా జిల్లా ఎమ్మెల్సీ ఎండీ కరీమున్నిసా గుండెపోటుతో శుక్రవారం అర్థరాత్రి మృతి చెందారు. శాసనమండలి సమావేశానంతరం ఇంటికి వచ్చిన ఆమె రాత్రి 11.30 గంటల సమయంలో గుండెపోటు వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన విజయవాడలోని ఓ ఆస్పత్రికి తరలించారు. అయితే, చికిత్స పొందుతూ మృతి చెందారు. శుక్రవారం ఉదయమే అసెంబ్లీ సమావేశాలకు కూడా కరీమున్నీసా హాజరయ్యారు.
కరీమున్నీసా కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. ఆ తర్వాత వైఎస్సార్సీపీలో చేరి.. పార్టీ స్థాపించిన రోజు నుంచి క్రియాశీలకంగా వ్యవహించారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి 56వ డివిజన్ కార్పొరేటర్‌గా పనిచేశారు. వైఎస్సార్‌సీపీ ఆవిర్భావం నుంచి కరీమున్నీసా పార్టీ కోసం నిరంతరం శ్రమించారు. ఈ ఏడాది ఎమ్మెల్సీగా ఆమెకు సీఎం జగన్ అవకాశం కల్పించారు. ఈ ఏడాది మార్చి 8న ఆమె శాసనసభ్యుల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. శుక్రవారం ఉదయం శాసనమండలిలో ఆమె సీఎం జగన్, శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజును కలిశారు. కరీమున్నీసాకు భర్త, ఐదుగురు కుమారులు ఉన్నారు. కాగా, కరీమున్నీసా మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital