Thursday, November 21, 2024

రాయచోటిలో పార్కుల నిర్మాణాలు

రాయచోటి పట్టణంలో రూ 6.6 కోట్ల నిధులుతో నిర్మించనున్న పార్కుల అభివృద్ధి పనులు పట్టణ అందానికి దిక్సూచిలా ఉండాలని చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. మంగళవారం శ్రీకాంత్ రెడ్డి తన కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాషాతో కలసి మున్సిపల్, పబ్లిక్ హెల్త్, డిజైనర్లు, కాంట్రాక్టర్లుతో జూమ్ మీటింగ్ ద్వారా చర్చించారు. రూ 2.5 కోట్ల నిధులుతో రాయచోటి పట్టణ నడిబొడ్డున వెళుతున్న నాలుగు వరుసల జాతీయ రహదారి మధ్యలో 6 కిలోమీటర్ల మేర డివైడర్లను ఎత్తు పెంచడం, మొక్కలు పెంపకంతో సుందరీకరణ పనులు, రూ.3.5 కోట్ల నిధులుతో పట్టణ శివార్లలోని మూడు ఎకరాల ప్రభుత్వ స్థలంలో నిర్మించనున్న పార్కుల నిర్మాణాలపై సమీక్షించారు. పార్క్ డిజైన్ మ్యాపులును పరిశీలించి వాటి చేర్పులు,మార్పులుపై మొదటి రివ్యూలో చర్చించారు. ఈ సమీక్షలో అనేక అంశాల చేర్పులు,మార్పులును ఇంజనీర్లకు, డిజైనర్లుకు  శ్రీకాంత్ రెడ్డి సూచించారు.

పార్కులను సుందరంగా నిర్మించి ప్రజలకు ఆహ్లాదకర, ఆరోగ్యపరమైన వాతావరణాన్ని అందించాలన్నదే తన లక్ష్యమన్నారు. వీటి నిర్మాణాలులో ఏ మాత్రం అలక్ష్యం చేయకుండా నిర్ణీత సమయానికి అన్ని హంగులుతో కూడిన పార్కులను నిర్మాణాలకు సహకరించాలన్నారు. వీటితో పాటు పట్టణంలో నిర్మించనున్న మరిన్ని పార్కుల ఏర్పాట్లుపై చర్చించారు. పార్క్ లలో విద్యుత్, త్రాగునీరు, చెట్లపెంపకం, వ్యాయామ ఉపకరణాలు, పిల్లల క్రీడా పరికరాలు తదితర సౌకర్యాల కల్పనపై శ్రీకాంత్ రెడ్డి కీలక సూచనలు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement