Saturday, November 23, 2024

జగనన్న ఇళ్లు కొత్త జంటల శోభనానికి పనికిరావు: వైసీపీ ఎమ్మెల్యే

ఏపీలో వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జగనన్న ఇళ్లు కార్యక్రమానికి శ్రీకారం చూట్టిన సంగతి తెలిసిందే. అయితే, ఈ పథకంపై వైసీపీ ఎఎమ్మెల్యే న‌ల్ల‌పురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. జగనన్న ఇళ్లు చిన్న కుటుంబాలకి కూడా సరిపోవని ఆయన అన్నారు. అర్బన్‌లో అయితే మరీ ఘోరంగా 6 అంకణాల్లోనే ఇళ్లు ఇస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. బెడ్ రూమ్స్‌లో పెళ్ళయిన కొత్త జంటలకు శోభనానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుందని వ్యాఖ్యానించారు. బెడ్ రూమ్ చాలా చిన్నదిగా ఉందని.. లబ్ధిదారులు రాత్రివేళల్లో బెడ్ రూమ్ లో ఏదైనా పని చేయాలనుకున్నా ఇబ్బందిగా ఉంటుందన్నారు. బెడ్ రూమ్ లో పెద్ద మంచం వేయాల్సి వస్తే కష్టంగా ఉంటుందని పేర్కొన్నారు. అలాంటి ఇళ్లలో హాల్లో శోభనం చేసుకొని బెడ్రూమ్‌లో పడుకోవాల్సి వస్తుందని చెప్పారు. బాత్ రూమ్ బయట ఏర్పాటుచేసి బెడ్రూమ్ సైజు పెంచాలని సూచించారు.

కాగా, నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘వైఎస్సార్ జగనన్న కాలనీ’ల పేరిట పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. మొదటి దశలో భాగంగా ముఖ్యమంత్రి జగన్ జూన్ 3న రాష్ట్రవ్యాప్తంగా 15,60,227 ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించారు. మొదటి దశ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఇప్పటికే రూ.28,084 కోట్ల నిధులు కేటాయించింది. మూడు విభాగాలుగా గృహ నిర్మాణ పథకం అమలు చేస్తున్న ప్రభుత్వం.. ఆయా ఐచ్ఛికాల ఎంపికను లబ్ధిదారులకే వదిలేసింది. తొలిదశలో 8,905 లేఅవుట్లలో 11.26 లక్షల ఇళ్లను వైఎస్సార్ జగనన్న కాలనీలు పేరిట ప్రభుత్వం నిర్మిస్తుంది. అయితే, అధికార పార్టీ ఎమ్మెల్యే జగనన్న ఈ త‌ర‌హా వ్యాఖ్య‌లు చేయ‌డం ఇప్పుడు చ‌ర్చనీయాంశం అయింది. ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి వ్యాఖ్యలపై పార్టీ అధినాయ‌క‌త్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

ఇదీ చదవండి: టీటీడీకి కొత్త బోర్డు ఏర్పాటు చేయండి: జగన్‌కు రఘురామ లేఖ

Advertisement

తాజా వార్తలు

Advertisement