ఏపీ బడ్జట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే సమయంలో నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజుపై వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ తీవ్ర విమర్శలు చేశారు. పార్టీ గుర్తు, నాయకుడి ఫోటోతో గెలిచారన్నారు. ఆయన రాజీనామా చేస్తే వార్డ్ మెంబెర్‌గా కూడా గెలవలేరని అన్నారు. ఈ క్రమంలో ఎంపీపై జోగి రమేష్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. అనంతరం, వేరే సభలో సభ్యుడు అయిన వ్యక్తి గురించి అసెంబ్లీలో విమర్శించడం తప్పని, తాను మాట్లాడిన విషయాల్లో తప్పులుంటే రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్‌ను కోరారు.
దీనిపై స్పందించిన సీఎం జగన్ మాట్లాడుతూ ఎమ్మెల్యే జోగి రమేష్‌కు థ్యాంక్స్ చెబుతూ అభినందించారు. జోగి రమేష్ బాధలో ఆప్యాయత కనిపించిందని, అందుకే అతనికి థాంక్స్ చెబుతున్నానని అన్నారు. తప్పుచేసి ఉంటే రికార్డుల నుంచి ఆ పదాలను తొలగించాలని జోగి రమేష్ స్పీకర్‌ను కొరడం అభినందించ తగ్గ విషయమని సీఎం జగన్ పేర్కొన్నారు.