ప్రజా సంకల్ప యాత్రలో ప్రజల కష్టసుఖాలు తెలుసుకొని ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అన్నింటిని అమలు చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కొనియాడారు. ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభించి నేటికీ నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా తుని పట్టణంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. పార్టీ నాయకులు ఏలూరి బాలు, రేలంగి రమణ గౌడ్, అనిశెట్టి సూర్య చంద్ర రెడ్డి పార్టీ శ్రేణులతో కలిసి రామ థియేటర్ సెంటర్ లో గల వైయస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలు మాట్లాడుతూ పేద ప్రజల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నారన్నారు. నవరత్నాల పథకాలతో నే సంక్షేమ సాధ్యపడిందని పేర్కొన్నారు. అట్టడుగు వర్గాల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొంటూ, దేశంలో మరే రాష్ట్రంలోనూ అమలు జరగనన్ని సంక్షేమ కార్యక్రమాలను జగనన్న ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement