Friday, November 22, 2024

తెలంగాణ మంత్రులకు ఏపీ సంగతి ఎందుకు?: సజ్జల ఎదురు దాడి

తెలుగు రాష్ట్రాల మధ్య మాటల యుద్ధం మొళ్లీ మొదలైంది. నిన్న మొన్నటి వరకు నీటి వివాదంపై విమర్శలు చేసుకోగా.. ఇప్పుడు రాజకీయంగా మాటల తుటాలు పేల్చుతున్నారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీకి వెళ్లి బిచ్చమెత్తుకుంటారని తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు ఇప్పుడు ఇరు రాష్ట్రాల మద్య చిచ్చు రాజేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, సీఎం జగన్ పైనా ఏపీపై తెలంగాణ మంత్రులు విమర్శలు చేయడం వారి రాజకీయ అపరిపక్వతకు నిదర్శనమని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఎలాంటి గొడవలు లేకుండా, భేషజాలకు పోకుండా ఏపీతో ఉన్న అన్ని సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకుంటామని తెలంగాణ సీఎం కేసీఆర్ పలు సందర్భాల్లో చెప్పారని అన్నారు. కేసీఆర్‌ చెప్పిన మాటలను ఆ రాష్ట్ర మంత్రులు వినలేదేమోనని ఎద్దేవా చేశారు. అయినా ఏపీ విషయాలు తెలంగాణ మంత్రులకు అవసరమా? అని ప్రశ్నించారు. ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధి మొత్తం హైదరాబాదులోనే కేంద్రీకృతం కావడం వల్ల అందులో వాటా ఇవ్వాలని రాష్ట్ర విభజన సమయంలో అడిగామని గుర్తు చేశారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడదీయడం తప్పు అని చంద్రబాబుకు, కాంగ్రెస్ కు అప్పుడే చెప్పామని సజ్జల చెప్పారు.

ఇది కూడా చదవండి: తెలంగాణ రాష్ట్రాన్ని బలవంతంగా లాక్కున్నారు: కేసీఆర్ పై ఏపీ మంత్రి సంచలన వ్యాఖ్య

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి 

https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

- Advertisement -



Advertisement

తాజా వార్తలు

Advertisement