ఏపీ సీఎం జగన్ పై నమోదైన కేసుల ఎత్తివేత అంశంపై రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే సీఎం జగన్ పై గతంలో కేసులు నమోదు చేశారని ఆరోపించారు. చంద్రబాబు ఓటుకు నోటు వ్యవహారం వెలుగు చూశాక, జగన్ పై ఇష్టం వచ్చిన రీతిలో 30 కేసుల వరకు నమోదయ్యాయని తెలిపారు. అవి అసలు కేసులే కాదన్నారు. జగన్‌కి వ్యతిరేకంగా గత పదేళ్లుగా కుట్రలు జరుగుతూనే ఉన్నాయని చెప్పారు. గతంలో టీడీపీ నేతలపై ఉన్న కేసులను చంద్రబాబు ప్రభుత్వం ఎత్తేసిందని, వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు నేర్పరి అని సజ్జల పేర్కొన్నారు. వ్యవస్థల్లోని కీలక వ్యక్తులను కుట్రలకు వాడుకుంటున్నారని ఆరోపించారు. సీఎం జగన్ కు వ్యతిరేకంగా పథకం ప్రకారం అసత్య ప్రచారానికి పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని శక్తులు వీరంగం వేస్తున్నాయని మండిపడ్డారు.
జగన్‌పై పదేళ్లుగా కుట్రలు.. అవి అసలు కేసులే కాదు: సజ్జల
By mahesh kumar
- Tags
- andhra news
- andhra pradesh
- andhra pradesh news
- ap
- AP Breaking news
- Ap government
- ap latest news
- AP Nesw
- AP NEWS
- ap news today
- AP politics
- CM YS Jagan
- important news
- Important News This Week
- Important News Today
- Latest Important News
- Most Important News
- telugu breaking news
- Telugu Daily News
- Telugu Important News
- telugu latest news
- telugu news
- telugu news online
- Telugu News Updates
- Today News in Telugu
- ysrcp leader sajjala ramakrishna reddy
Previous article
Next article
మరిన్ని వార్తలు
Advertisement
తాజా వార్తలు
Advertisement