వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా భరత్ నామినేషన్

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున కృష్ణ రాఘవ జయేంద్ర భరత్ నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారి పి.రాజాబాబుకు నామినేషన్ పత్రాలను అందించారు. కుప్పంకు చెందిన కృష్ణ రాఘవ జయేంద్ర భరత్ కి సీఎం జగన్ ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. కాగా, కార్యక్రమంలో లోక్ సభ ప్యానల్ స్వీకర్ మిథున్ రెడ్డి, చిత్తూరు పార్లమెంటు సభ్యులు ఎన్.రెడ్డెప్ప, జడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.