అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం వైసీపీలో ముసలం పుట్టింది. ఎమ్మెల్యే ఉష శ్రీ చరణ్ అనుసరిస్తున్న ఒంటెత్తు పోకడలకు నిరసనగా మిగిలిన నాయకులంతా ఏకతాటిపైకి వచ్చారు. తోపుడు బండిపై కూరగాయలు అమ్ముకునే తలారి రాజ్‌కుమార్ ను ఎమ్మెల్యే చైర్మన్ గా ఎంపిక చేశారు. అయితే ఆయన ఎన్నికైన అప్పటి నుంచి ఒక్కసారి కూడా మున్సిపల్ చైర్మన్ గా కూర్చోలేదు. ఎమ్మెల్యే శ్రీ చరణ్, ఎంపీ తలారి రంగయ్యకు సంబంధించిన నాయకులు రెండు వర్గాలుగా విడిపోయి, ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటూ వస్తున్నారు. రాజ్ కుమార్ మున్సిపల్ కార్యాలయంలో తన కుర్చీలో కూర్చున్నాడు. దీన్ని ఎమ్మెల్యే వర్గం తీవ్ర స్థాయిలో వ్యతిరేకించింది. మిగిలిన వైసిపి నాయకులు.. ఏకమై రోడ్లు భవనాల అతిథిగృహంలో సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసారు. జరుగుతున్న విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డితో చర్చించి రాజ్‌కుమార్ ను మున్సిపల్ చైర్మన్ కుర్చీపై కూర్చోపెట్టారు. వివాదం ఇప్పటికిప్పుడు సమసిపోయే విధంగా లేకపోయింది. అధిష్టానం జోక్యం చేసుకుంటే తప్ప పరిస్థితి చక్క పడే అవకాశం లేదని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.
Advertisement
తాజా వార్తలు
Advertisement