Friday, November 22, 2024

Ysrcp – దుష్టచతుష్టాన్ని ఓడించేందుకు అర్జునుడు సిద్ధం – జగన్

ప్రొద్దుటూరు – 58 నెలల తన పాలనలో ప్రతి రంగంలోనూ మార్పులు తీసుకొచ్చామని సీఎం జగన్ అన్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.కడప జిల్లా ప్రజలను తనను బిడ్డలా చూసుకున్నారని తెలిపారు. పేద ప్రజలకు రూ. 2 లక్షల 70 వేల కోట్లు సంక్షేమ పథకాల రూపంలో పంచామని తెలిపారు. 2024 ఎన్నికలకు తామంతా సిద్ధంగా ఉన్నామని జగన్ పేర్కొన్నారు. పేదల భవిష్యత్తును మార్చేందుకు తాను ప్రయత్నం చేస్తుంటే దుష్టచతుష్టం అడ్డుపడుతోందని మండిపడ్డారు. దుష్టచతుష్టాన్ని ఓడించేందుకు అర్జునుడు సిద్ధంగా ఉన్నాడని జగన్ హెచ్చరించారు. మే 13న జరిగే ఎన్నికల్లో ప్రజలందరూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని సీఎం జగన్ పిలుపునిచ్చారు.

అబద్ధాలు, మోసాలు, కుట్రలు చేసే వారే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రత్యర్ధులని జగన్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రజలను 45 ఏళ్లుగా చంద్రబాబు మోసం చేస్తూనే ఉన్నారని జగన్ విమర్శించారు. ఎన్నికల సమయంలో మాత్రమే చంద్రబాబుకు మేనిఫెస్టో గుర్తుకువస్తుందని, ఆ తర్వాత అది చెత్త బుట్టకేపరిమితమవుతుందని సీఎం జగన్ ఎద్దేవా చేశారు. వైఎస్ వివేకానందారెడ్డిని హత్య చేసిందే ఎవరో అందరికి తెలుసున్నారు. హంతుకుడికి తన ఇద్దరి చెల్లెమ్మలు మద్దతు ఇస్తున్నారని సీఎం జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.

డ్రగ్స్ కంటైనర్ వ్యవహారంపై ..

ఇటీవల విశాఖలో కలకలం రేపిన డ్రగ్స్ కంటైనర్ వ్యవహారంపై తొలిసారిగా స్పందించారు . ‘చంద్రబాబు వదిన గారి చుట్టం తన కంపెనీకి బ్రెజిల్ నుంచి డ్రైడ్ ఈస్ట్ పేరుతో డ్రగ్స్ ను పెద్దమొత్తంలో దిగుమతి చేస్తుంటే సీబీఐ వాళ్లు దాడి చేశారు. ఈ రెయిడ్ జరిగిందని తెలియగానే ఎల్లో బ్రదర్స్ అందరూ ఉలిక్కిపడ్డారు. దొరికింది వాళ్ల బ్రదరే అయినా, అతడు దొరికిపోయాడు కాబట్టి అతడిని మన (వైసీపీ) వాడు అని దుష్ప్రచారం చేస్తున్నారు. తీరా చూస్తే వారు ఎవరయ్యా అంటే… సాక్షాత్తు మన రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు, చంద్రబాబు వదిన గారి కొడుకు, వియ్యంకుడు ఆ కంపెనీలో గతంలో డైరెక్టర్లు, భాగస్వాములు. బాబు అక్కడ నిలబెట్టిన ఎంపీ అభ్యర్థులకు ఇంకా బాగా దగ్గరి బంధుత్వం ఉంది .

- Advertisement -

నేరమంటూ జరిగితే చేసింది వారు… కానీ తోసింది మన మీద. నేరం ఎక్కడైనా జరగనివ్వండి, ఎక్కడ ఏం జరిగినా మన మీద బురద చల్లడానికి ఒక చంద్రబాబు, ఒక దత్తపుత్రుడు వెంటనే రెడీ అయిపోతారు . వీళ్లందరూ ఓ ఎల్లో బ్యాచ్ గా తయారై నేరాన్ని మనకు ఆపాదిస్తారు. గత 45 ఏళ్లుగా చంద్రబాబు నడిపిస్తున్న క్షుద్ర రాజకీయాలను చూస్తూనే ఉన్నాం. దొరకని వాళ్లంతా టీడీపీ వాళ్లు… దొరికితే మాత్రం వైసీపీ వాళ్లు అంటారు. బతికున్నప్పుడు వివేకా గారిని శత్రువులా చూశారు. చనిపోయాక మాత్రం శవరాజకీయాలు, కుట్రలు చేస్తున్నారు. బతికున్న ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి చంపేస్తారు. చనిపోయాక వీళ్లే ఎన్టీఆర్ శవాన్ని లాక్కుని, విగ్రహాలు ఊరూరా పెట్టి, దండలు వేసి దణ్ణాలు పెడుతున్నారు. వీళ్ల నైతిక విలువలు ఎంత దయనీయంగా ఉన్నాయో చూడండి అని అన్నారు.

మీ అందరి ప్రేమానురాగాల మధ్య నిల్చొని అడుగుతున్నా. ప్రజల మద్దతు లేని చంద్రబాబు చేస్తున్న నీచ రాజకీయం చేసినా.. నేను మాత్రం ప్రజల పక్షం ఉంటా అని గర్వంగా చెబుతున్నా.నాపై బురద జల్లుతూ రాజకీయం చేస్తున్నారు. అబద్ధాలు చెప్పేవారు, కుట్రలు చేసేవాళ్లు మనకు శత్రవులుగా ఉన్నారు. అందరూ కలిసి జగన్‌పై యుద్ధానికి వస్తున్నారు. చంద్రబాబు, దత్తపుత్రుడు, బీజేపీ, కాంగ్రెస్‌ నా పై యుద్ధానికి కలిసి కట్టుగా వస్తున్నారు. ఇది చాలదన్నట్లు నా ఇద్దరు చెల్లెల్ని తీసుకొస్తున్నారు. వీళ్ల విలువలు లేని రాజకీయం ఎవరికి స్ఫూర్తి. నేను ఎప్పుడూ తప్పు చేయలేదు. నేను ధర్మాన్ని, న్యాయాన్ని నమ్ముకున్నా. నాకు ప్రజల అండగా, దేవుడి దయ ఉన్నాయి అని జగన్‌ పేర్కొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement