Sunday, November 17, 2024

YSRCP – కౌరవ సభకు వెళ్తున్నాం …. కానీ అదరొద్దు బెదరొద్దు – జగన్

( ఆంధ్రప్రభ స్మార్ట్, విజయవాడ ప్రతినిధి) – “ జగన్ ఓడిపోయాడు.. చనిపోలేదు అని ఒకరు అంటారు. చచ్చేదాకా కొట్టాలి, అని ఇంకొకరు అంటారు. ఇలాంటి కౌరవుల సభకు మనం వెళ్లాలి. ఇలాంటి వ్యక్తుల మధ్య అసెంబ్లీలో మనం ఏదో చేయగలం అనే నమ్మకం లేదు. పాపాలు పండే కొద్దీ ప్రజలతో కలిసి, ప్రజలతో నిలబడి చేసే కార్యక్రమాలు రాబోయే రోజుల్లో ఊపందుకుంటున్నాయి. శిశుపాలుడి పాపాలు పండినట్టుగా ఇప్పటికే చంద్రబాబు పాపాలు పండుతూనే ఉన్నాయి” వైసీపీ అధినేత జగన్అ న్నారు. శక్రవారం నుంచి అసెంబ్లీ సమావేశాలకు సన్నద్ధమవుతున్న తరుణంలో తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వైఎస్ జగన్ మాట్లాడుతూ, ‘‘ కులం, మతం, ప్రాంతం చూడకుండా.. ఏ పార్టీకి ఓటు వేశారని చూడకుండా.. జగన్ డోర్ డెలివరీ చేశారు. ఇవాళ తమ పార్టీకి ఓటు వేయలేదని దాడులు చేస్తున్నారు, అవమానిస్తున్నారు. ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. ప్రతి గ్రామంలోనూ అన్యాయంగా వ్యవహరిస్తున్నారు. శిశుపాలుడి పాపాలు చాలా వేగంగా పండుతున్నాయి” అని ఉద్వేగంగా జగన్ అన్నారు.

మనం ఓడిపోలేదు

“మనం ఎప్పుడూ కూడా ఇలాంటివి చూడలేదు. మన ప్రభుత్వంలో మేనిఫెస్టో అన్నది ప్రభుత్వ కార్యాలయాల్లో కనిపించే పాలన అయితే, ఇప్పుడు రెడ్ బుక్స్ అని హోర్డింగులు పెడుతున్నారు. అందులో ఏ అధికారిపై కక్ష సాధించాలి. ఎవరిపై దాడులు చేయాలి, ఎవరిపై కక్షసాధించాలి. అని రాసుకుంటున్నారు. కొడతాం, చంపుతాం అంటున్నారు, అయినా అదరం బెదరం అని జగన్ అన్నారు.

ఓడిపోయామన్న భావనను మనసులో నుంచి తీసేయండి. మనం ఓడిపోలేదు.. అన్న విషయాన్ని గుర్తించండి. న్యాయంగా, ధర్మంగా మనం ఓడిపోలేదు. ప్రతీ ఇంట్లో కూడా మనం చేసిన మంచి ఉంది. ప్రతీ ఇంటికీ కూడా మనం తలెత్తుకుని పోగలం. చెప్పిన పని చేశాం కాబట్టి.. ప్రజల మధ్యకి గౌరవంగా వెళ్లగలుగుతాం. కాలం గడుస్తున్న కొద్దీ మన పట్ట అభిమానం వ్యక్తమవుతుందన్నారు.

మళ్లీ గెలుస్తాం

- Advertisement -

మళ్లీ మనం రికార్డు మెజార్టీలో గెలుస్తాం. మోసపోతున్నవారికి మనం అండగా నిలవాలి. మనకార్యకర్తలకు మనం తోడుగా ఉండాలని జగన్ హిత బోధ చేశారు. ఎప్పుడూ చూడని విధంగా కార్యకర్తలమీద, సానుభూతి పరులమీద దాడులు చేస్తున్నారు. కొన్ని చోట్ల అవమానాలు, ఆస్తుల నష్టాలు చేస్తున్నారు. వీళ్లందరికీ కూడా భరోసా ఇవ్వాలన్నారు. మీ నియోజకవర్గంలో కార్యకర్తలకు తోడుగా ఉండండి. వారిని పరామర్శించండి. ఇప్పటికే పార్టీ తరపున ఆదుకునే కార్యక్రమాలు చేస్తున్నాం. పార్టీ ఇస్తే సహాయాన్ని మీరు స్వయంగా అందించండి. రాబోయే రోజుల్లో నేను కార్యకర్తలను కలుసుకుంటాను. నష్టపోయిన ప్రతీ కార్యకర్తనూ కలిసి వారికి భరోసానిచ్చే కార్యక్రమం చేస్తాను” అన్నారు. మా ఎమ్మెల్యే, మా ఎమ్మెల్యే కేండిడేట్ మా వద్దకు రాలేదనే మాట అనిపించుకోవచ్చు. కార్యకర్తలు కష్టాల్లోనూ మనతోనూ ఉన్నారు. జెండాలు మోసి కష్టాలు పడ్డారు. వారికి తోడుగా నిలవాలి. ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలరు అందరికీ భరోసా ఇవ్వండి. వీరిని బెదిరించే కార్యక్రమాలు, జోరుగా ప్రలోభాలు జరుగుతున్నాయి. రాజీనామాలు చేయాలని బెదిరిస్తున్నారు. మీ నియోజకవర్గాల్లో కార్యకర్తలను, నాయకులను పిలిచి మాట్లాడండి అని జగన్ వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement