Monday, November 18, 2024

YSRCP – జ‌గ‌న్ జెట్ స్పీడ్ …

అమరావతి, ఆంధ్రప్రభ : అధికార వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ 2024 సార్వత్రిక ఎన్నికలకు కేడర్‌ను సిద్ధం చేస్తోంది. ఆమేరకు విధి విధానాలను రూపొందించింది. ఇప్పటికే సిట్టింగులు, ఇన్‌ఛార్జిలను గడప గడపకు మన ప్రభుత్వం పేరుతో ప్రజల్లోకి పంపుతున్న అధినేత జగన్‌ తాజాగా కేడర్‌ ప్రజలతో మమేకం అయ్యేందుకు ఐప్యాక్‌ టీంతో కలిసి విభిన్న కార్యక్రమాలను రూపొందిస్తున్నారు. ఒకవైపు అమాత్యుల కార్యక్రమాలు జరగుతూ ఉండగానే దానికి సమాంతంగా కేడర్‌ కూడా ప్రజలతో మమేకం అవుతూ వారి వారి సమస్యల ను నేరుగా చెప్పుకునే లా ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో భాగంగానే జిల్లా పార్టీ నేతలతో బస్సు యాత్రలు, జగనన్న సురక్ష క్యాంపులు, వై ఏపీ నీడ్స్‌ జగన్‌వంటి పలు కార్యక్రమా లను నిర్వహిస్తోంది. ఈక్రమంలోనే అవి విజయవంతంగా అమల య్యేలా పార్టీ శ్రేణులను వైసీపీ నాయకత్వం అప్రమత్తం చేస్తోంది. కీలక అంశాలపై కేడర్‌కు దిశానిర్దేశం చేస్తోంది. ఎన్నికల వేళ ప్రతీ ఒక్కరూ అప్రమత్తంగా ఉండాల ని నిర్దేశిస్తోంది. ఇదే సమయంలో ప్రతీ నియోజకవర్గంలో నూ వై ఏపి నీడ్స్‌ జగన్‌ అనే కార్యక్రమాన్ని అత్యంత పకడ్బం దీగా నిర్వహించాలని ఆదేశించింది. ఓటర్ల లిస్ట్‌ ఫైనలైజేషన్‌ లో భాగంగా ఇంటింటికి తిరిగే
కార్యక్రమం కాబట్టి బూత్‌ లెవల్‌ ఏజంట్స్‌ ద్వారా తగిన కసరత్తు పూర్తిచేయాలని ఆదేశించింది.

రెండోసారి అధికారమే లక్ష్యం
జగన్‌ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని రాష్ట్రంలోని ప్రజలంతా కోరుకుంటు-న్నారని పార్టీ గట్టి నమ్మకంతో ముందుకు సాగు తోంది. జగన్‌ పారదర్శకమైన పరిపాలన పట్ల ప్రజల అభిమానం రోజురోజుకు పెరుగుతోందని నేతలు చెబుతున్నారు. విపక్షాలు విడివిడిగా పోటీచేసినా, కలిపి సోటీ చేసినా వైయస్సార్సీపీ విజయం ఖాయమైందని, అయితే ప్రతి నియో జకవర్గంలో కూడా పార్టీ మెజారిటీ- పెంచే దిశగా పార్టీ శ్రేణులు పనిచేయాలని కేడర్‌కు నేతలు దిశానిర్దేశం చేస్తున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షులు, శాసనసభ్యులు, నియోజకవర్గ ఇన్‌ఛార్జిలు, పరిశీలకులు, జేసీఎస్‌ కోర్డినేటర్లను బాధ్యులు చేస్తూ ఒక్కొక్కరికి ఒక్కో కార్యక్రమం అప్పగిస్తున్నారు. ఓటర్ల జాబితా సవరణకు సంబంధించి అన్ని అంశాలను పరిగణనలోనికి తీసుకుని పనిచేసేలా ప్రధాన కార్యాచరణ సిద్ధమౌతోంది. ముఖ్యంగా అర్హులైన ఓటర్లను గుర్తించి వారికి ఓటు- హక్కు కల్పించే అంశంలో ప్రత్యేక దృష్టి సారించేలా పార్టీ కేడర్‌కు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇక బోగస్‌ ఓట్లపై అప్రమత్తంగా ఉండేలా కూడా ఎప్పటికప్పుడు కేడర్‌కు స్పష్టమైన సూచనలు ఇస్తున్నారు.

60 లక్షలకు పైగా దొంగఓట్లు-
గత ప్రభుత్వం హయాంలో దాదాపు 60 లక్షలకు పైగా దొంగఓట్లను చేర్పించారనే ఆరోపణలు ఉన్నాయని, వాటిని గుర్తించి తొలగించే విధంగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికల కమిషన్‌ దృష్టికి తీసుకు వెళ్లాలని అధిష్టానం ఇప్పటికే పార్టీ కేడర్‌కు సూచించింది. రానున్న ఎన్నికలకు సంబంధించి ఇది కీలకమైన అంశం కాబట్టి పూర్తిగా మనస్సు పెట్టి పనిచేయాలని పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశాలు ఇచ్చారని కూడా వారు ఈ సందర్భంగా కేడర్‌కు వివరించారు. పరిశీలకులు వారికి కేటాయించిన నియోజకవర్గంలో బాధ్యతతో పనిచేయాలని అత్యధిక సమయం కేటాయించాలని ఆదేశిస్తున్నారు. శాసనసభ్యులు, రీజనల్‌ కోఆర్డినేటర్లకు సమన్వయం చేసి ఆయా నియోజకవర్గాలలో అందరూ ఐకమత్యంతో పనిచేసేలా పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. రానున్న సమయం అంతా ఎన్నికలకు సంబంధించి కాబట్టి పోటీచేసే అభ్యర్దులకు సహాయ కారిగాఉండేలా వ్యవహరించాలని, ఆమేరకు ఇప్పటి నుండే సమన్వయ బాధ్యతలు మరింతగా చేపట్టాలని ఆదేశిస్తున్నారు.

వై ఏపీ నీడ్స్‌ వైయస్‌ జగన్‌
గృహ సారథులు, సచివాలయ కన్వీనర్లు, మండల కన్వీనర్లకు బీమా సౌకర్యం కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించిన సమాచారం ఇప్పటికే పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరింది. ఏదైనా కారణాలవల్ల ఎవరైనా ఇంకా ఆయా నియోజకవర్గాలనుండి ఈ సమాచారం పంపలేకపోతే త్వరగా వారికి సంబంధించిన సమాచారం పంపించాలని సూచించారు. రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో శాసనసభ్యులు, నియోజకవర్గ ఇన్‌ఛార్జిలు వై ఏపి నీడ్స్‌ జగన్‌ అనే అంశంపై సమావేశాలు నిర్వహించాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా 9 నెలల్లో ఎన్నికలు రానున్న తరుణంలో పార్టీ శ్రేణులంతా ప్రతిపక్షాల విమర్శలను ఎక్కడిక్కడ.. ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని చెబుతున్నారు. ఈక్రమంలోనే మండల స్థాయిలో అధికార ప్రతినిధులను నియమిస్తున్నారు. వారు స్థానికంగా ఉండే నేతల ఆరోపణలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ వాస్తవాలను ప్రజలకు తెలియజేసేలా కార్యాచరణ సిద్ధమౌతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement