Sunday, September 8, 2024

YSRCP – మీ బిడ్డ గొంతు నొక్కేస్తున్నారు – అధికారం కోసం అడుగుడునా కుట్రలే – చంద్రబాబుపై జగన్ ఆగ్రహం

(ఆంధ్రప్రభ స్మార్ట్, చిలకలూరి ప్రతినిధి) – ఏపీలో జరగబోయేది రెండు కులాల మధ్య యుద్ధం కాద‌ని, రెండు సిద్ధాంతాల మధ్య యుద్ధం జరుగుతోంద‌ని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో శనివారం ఎన్నికల ప్రచారంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను తూర్పారబట్టారు. చిలకలూరిపేటలో జనం పోటెత్తారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పేదవాడు ఒకవైపు… పెత్తందారు ఒకవైపు ఉన్నార‌న్నారు. అధికారం కోసం కుట్ర‌లు ప‌న్నుతున్నార‌ని ప్ర‌జ‌లు గ‌మ‌నించాల‌న్నారు. రెండు నెలల కింద వరకూ అవ్వాతాతలకు పెన్షన్ ఇంటికే వచ్చేది.. దీని వ‌ల్ల ఎక్కడ మీ బిడ్డకు మంచి పేరు వస్తుందో అని పెన్షన్ ఆపేసి.. ఆ అవ్వాతాతల ఉసురు తగిలించుకున్నారు. అవినీతి, అక్రమాలు లేని, లంచాలు, వివక్ష లేని పాలనలో సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మీ బిడ్డ జగన్ కే ఓటు వేయాలన్నారు. పొరబాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపుతో మోసపోతారని హెచ్చరించారు.

మీ బిడ్డ గొంతు నొక్కేస్తున్నారు
ఏ ప్రభుత్వమైన 60 నెలల కోసం ప్రజలు ఎన్నుకుంటారు. కానీ, 57 నెలలకే మీ బిడ్డ ప్రభుత్వం గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. మీ బిడ్డ బటన్లు నొక్కిన సొమ్మును ఆ అక్కాచెల్లెమ్మలకు ఇవ్వకుండా ఢిల్లీతో కలిసి కుట్రలు చేస్తున్నార‌న్నారు. ఈ డబ్బంతా ఎన్నికలయ్యాక 14వ తేదీ ఇస్తారట.. ఇది కుట్ర కాదా? అని ప్రశ్నించారు.

- Advertisement -

అంతా దుష్ప్ర‌చార‌మే
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, రిజిస్టేషన్ల మీద ఎంత దుష్ప్రచారం చేస్తున్నారో చూస్తున్నాం. ఇదే చంద్రబాబు వియ్యంకుడు బాలకృష్ణ విశాఖలో, దత్తపుత్రుడు ఏపీలో భూములు కొన్నారు.. మరి వీరికి ఒరిజినల్ ఇచ్చారా?. మరి జిరాక్స్ ఇచ్చారా? అని ప్రశ్నించారు. ఏపీలో 9 లక్షల మంది రిజిస్ట్రేష‌న్ చేయించారు. కానీ, చంద్రబాబు దుష్ప్రచారం ఏ స్థాయిలో ఉందో గమనించాలి అని సీఎం జగన్ కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement