ఎన్నికల హామీలు నెరవేర్చలేక తంటాలు
శ్వేత పత్రాలతో జనాన్ని మభ్యపెడుతున్నారు
రాష్ట్రం ఎటు పోతుందో ఆలోచించండి
పోలీసులు ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్నారు
అప్పుల పేరిట అన్నీ అబద్ధాలే
అత్యధిక అప్పులు చేసింది చంద్రబాబే
ఆర్థిక స్థితిపై గవర్నర్‌కు వివరిస్తాం
మీడియాతో వైసీపీ అధినేత జగన్
ఆంధ్రప్రభ స్మార్ట్, విజయవాడ ప్రతినిధి : ఎన్నికల హామీలను అమలు చేయలేని స్థితిలో.. బడ్జెట్ ప్రవేశ పెట్టకుండా చంద్రబాబు నాయుడు కాలయాపన చేస్తున్నారని వైసీపీ అధినేత జగన్మోహన్రెడ్డి ఆరోపించారు. ఎక్కడ ఎన్నికల హామీలు అమలు చేయాల్సి వస్తుందో అని చంద్రబాబు భయపడుతున్నారని విమర్శించారు. ప్రజలు ప్రశ్నించకుండా ఉండేందుకు ప్రత్యర్థులను బెదిరిస్తున్నారని, ఇందులో మీడియాను కూడా వాడుకుంటున్నారని జగన్ ధ్వజమెత్తారు. తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు అంటేనే వంచన, గోబెల్స్ ప్రచారం. ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడవడం నుంచి ప్రజల్ని మోసం చేయడం వరకూ అన్నింటా ఇదే జరుగుతోందన్నారు. ఇప్పుడు రాష్ట్రం క్లిష్టపరిస్థితుల్లో ఉందని చంద్రబాబుగ్యాంగ్ ప్రచారం చేస్తోందని, రాష్ట్రం ఆర్థికంగా ధ్వంసం అయ్యింది. అందుకే పూర్తిస్థాయి బడ్జెట్ పెట్టడం లేదని చంద్రబాబు తప్పించుకుంటున్నారని జగన్ఎద్దెవచేశారు.
అప్పులు రూ.5.18 లక్షల కోట్లు
ఎన్నికల సమయంలో 14 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని చెబుతూ చంద్రబాబు సూపర్ సిక్స్ హామీలు ఇచ్చారని . ఇప్పుడు అధికారం వచ్చాక అది అప్పులెన్నో చూపించటానికి పడరాని పాట్లు పడుతున్నారని జగన్వివరించారు. గవర్నర్ ప్రసంగం వరకు వచ్చే సరికి రూ 10 లక్షల కోట్ల అప్పు చూపించారని, ఇప్పుడు . శ్వేత పత్రాలతో మభ్య పెట్టే యత్నం చేస్తున్నారని, నిజానికి కాగ్, స్టేట్ బడ్జెట్ ప్రకారం గమనిస్తే ఈ ఏడాది జూన్ వరకూ, అదీ చంద్రబాబు ప్రభుత్వం వచ్చేంత దాకా చూస్తే అప్పు రూ 5.18 లక్షల కోట్లు ఉందని మాజీ సీఎం జగన్వివరించారు. చంద్రబాబు హయాంలో 21.63 శాతం అప్పు చేశారు, వైసీపీ హయాంలో 12.9 శాతం మాత్రమే అప్పు చేశామని జగన్వివరించారు. మా ప్రభుత్వ పని తీరును . కేంద్ర ఎకనామిక్ సర్వే మెచ్చుకుంది , బడ్జెట్లోనూ ఈ లెక్కలన్నీ చెప్పాల్సి వస్తుందనే పూర్తిస్థాయి బడ్జెట్ పెట్టడం లేదని, పైగా . 14 లక్షల కోట్ల అప్పు ఉందని చెప్పడం ధర్మమా?అని జగన్ప్రశ్నించారు.
రాష్ట్రం ఎటు పోతోంది ?
రాష్ట్రం ఎటు వైపు వెళ్తుందో అందరూ ఆలోచించాలని మాజీ సీఎం జగన్ పిలుపునిచ్చారు. గత 52 రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న దాడులు, అత్యాచారాలు, ఆస్తులు ధ్వంసం చూస్తుంటే పురోగతి వైపు వెళ్తుందా?.. రివర్స్‌లో వెళ్తోందా అనే అనుమానం కలుగుతుందన్నారు. ప్రశ్నించే వాళ్లు లేకుండా ఉండేలా పాలన సాగుతోందని ఆరోపించారు. విధ్వంస పాలన కొనసాగుతుంటే పోలీసులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారు. చట్టాన్ని, న్యాయాన్ని పట్టించుకోవటం లేదని, వినుకొండ హత్య కేసులో పోలీసులు పాలకులకు కొమ్ము కాశారని ఆరోపించారు. బడ్జెట్ కూడా పెట్టలేని అధ్వానమైన స్థితిలో చంద్రబాబు ప్రభుత్వం ఉంది. ఏడు నెలల ఓటాన్ బడ్జెట్ పెడుతోంది. పూర్తిస్థాయి బడ్జెట్ పెట్టే దైర్యం లేంటే ఎంతటి దారుణమైన పాలనో అర్థం చేసుకోవాలన్నారు. పూర్తి బడ్జెట్ పెడితే చంద్రబాబు నాయుడు మోసపూరిత హామీలు ఏమైతే ఇచ్చారో వాటికి కేటాయింపులు చూపించాల్సిన అవసరం వస్తుందని, అందుకే ఆ పని చేయడం లేదని జగన్విమర్శించారు.
వినుకొండ హత్యను దారి మళ్లించారు
మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ఘటనపై వైసీపీ అధినేత జగన్ మాట్లాడుతూ, వినుకొండలో రషీద్ అనే దారుణంగా హత్య చేశారని, అందులో నిందితుడు టీడీపీ నాయకులకు సన్నిహితుడని, . కానీ వారిపై కేసులు పెట్టలేదన్నారు. ఎమ్మెల్యే బంధువులపై కానీ, ఇతరులపై కేసులు లేవని, వీటిపై ప్రశ్నిస్తుంటే ప్రజలను దారి మళ్లించటానికి మదనపల్లిలో ఘటన తెరమీదకు తెచ్చారని జగన్ ఆరోపించారు. సీఎం రెండుసార్లు రివ్యూ చేశారని, . డీజీపీని ప్రత్యేక హెలికాప్టర్‌లో పంపించి హడావుడి చేశారని, పెద్దిరెడ్డి, మిధున్ రెడ్డిపై ఆరోపించారని జగన్ వివరించారు. అక్కడ అగ్ని ప్రమాదం జరిగితే ఫైల్స్ ఆన్‌లైన్ లో ఉంటాయి కదా… అని ప్రశ్నించారు.
ఇంత హడావుడి దేనికి..
ఇంత హడావుడి దేనికి అని జగన్ నిలదీశారు. ఇన్నిసార్లు గెలుస్తున్నారంటే వాళ్లకు ప్రజల్లో మంచి పేరు ఉందనే కదా అర్థమన్నారు. నియోజకవర్గంలో తిరగకుండా చేస్తూ వాళ్లపైనే తిరిగి కేసులు పెడుతున్నారని, ‘మచ్చుమర్రిలో బాలికను వెతకడానికి చంద్రబాబుకు మనసు రాదు , కానీ డీజీపీకి ప్రత్యేక హెలికాప్టర్ ఇచ్చి మదనపల్లి పంపిచారని ఆరోపించారు. మచ్చుమర్రి కేసులో నిందితుడిని లాకప్‌డెత్ చేశారని విమర్శించారు. బాధితులు ఆందోళన చేయడంతో పోలీసులపై చర్యలు తీసుకున్నారని జగన్ వివరించారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. తమ హయాంలో దిశా యాప్ ద్వారా మహిళలకు రక్షణ ఉండేదన్నారు. తమకు ఎక్కడ పేరు వస్తుందో అని దిశాను పక్కన పడేశారన్నారు.