Saturday, November 23, 2024

YSRCP – ఇక ఎన్నిక‌ల స‌మ‌రానికి వైసిపి సై… అస్త్ర‌శ‌స్త్రాల‌ను సిద్దం చేసుకుంటున్న జ‌గ‌న్

అమరావతి, ఆంధ్రప్రభ: సార్వత్రిక ఎన్నికలు స మీపిస్తున్న వేళ అధికార వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎన్ని కల బరిని సిద్ధం చేసుకుంటున్నారు. ఒకవైపు పార్టీ పై పూర్తిస్థాయి పట్టు సాధించుకుంటూ మరోవైపు పరిపాలనా పరంగా కీలక నిర్ణయాలు తీసుకుంటు న్నారు. ఈనేపథ్యంలోనే గడచిన వారం రోజులు గా ఆయన పలు అంశాలపై తీవ్రం గాకసరత్తు చేస్తున్నారు. అసెంబ్లిd వర్షాకాల సమా వేశాలను వచ్చే నెల మొదటి వారంలో నిర్వహిం చాలని యోచిస్తున్నారు. ఈ సమావేశాలను కీలకం గా నిర్వహించాలని భావిస్తున్నారు. ఎన్నికలను దృష్టి లో ఉంచుకుని ప్రవేశ పెట్టాల్సిన బిల్లులు, ఆమో దం తెలపాల్సిన పథకాలు, నిధుల సమీ కరణ, కొత్త లబ్దిదారులకు అవకాశం కల్పించడం తదితర అంశాలపై మేథోమథనం చేస్తున్నారు. ఈమేరకు పార్టీ సీనియర్లు, ఆయా రంగాల్లో నిష్ణాతుల అభిప్రాయాలను సేకరిస్తున్నారు. గతం లో ఎదు రైన అనుభవాలను క్రోడీకరిస్తూ ఈసారి అటు వం టి పరిస్థితులు ఎదురైతే తీసుకోవాల్సిన చర్యలు తదితరాలపై సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. మరీ ము ఖ్యంగా ప్రస్తుతం అమలవుతున్న నవ ర త్నాలకు సంబంధించి మరింత సంక్షేమాన్ని అందించేలా చర్యలు తీసుకోబోతున్నారు. లబ్దిదా రుల సంఖ్య ను మరింతగా పెంచేందుకు విధివిధా నాలను సరళతరం చేయాలని భావిస్తున్నారు.

ఇక విశాఖ రాజధానిగా చేసుకుని క్యాంపు కార్యాలయా న్ని కూడా ప్రారంభించే అంశంపై కూడా పెద్ద ఎత్తున కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా విశాఖలో తెదేపా అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్‌ కళ్యాణ్‌లు చేపట్టిన పర్యటనలకు ప్రజల నుండి స్పందన పెద్దగా లేదని పార్టీ అధిష్టా నం గుర్తించింది. పవన్‌ వారాహి యాత్రను ఒక రొ జు ముందుగానే ముగించాల్సిన పరిస్థితులపై కూ డా వివరాలు సేకరిస్తోంది. ఈక్రమంలోనే వారికి ఆదరణ లేదంటే ఉత్తరాంధ్ర పజలను వైసీపీని ఆదరిస్తున్నారన్న సంకేతాలు స్పష్టంగా కనిపి స్తున్న యన్నది పార్టీ భావనగా ఉంది.


ఈక్ర మంలోనే ఆలస్యం చేయకుండా విశాఖ కేంద్రంగా క్యాంపు కార్యాలయం ప్రారంభించేం దుకు వడి వడిగా అడుగులు వేయాలని భావిస్తున్నారు. ఆమే రకు ఒ కవైపు సెక్యూటిరీ అధికారులతోనూ, మరొ వైపు పార్టీ పెద్దలతోనూ సమాలోచనలు చేస్తు న్నట్లు గా తెలుస్తోంది. ఇక సాగునీటి ప్రాజెక్టు లను పూర్తి చేయడంపై ప్రత్యేక కార్యాచరణ రూ పొం దించా లని, ఆమేరకు వాటిని నిర్ణీణత గడు వులో పూర్తిచేసి ఎన్నికలకు వెళ్తే మంచి ప్రయో జనం ఉంటుందని బావిస్తు న్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

దసరా నాటికి గెలుపు గుర్రాల జాబితా
విజయదశమి నాటికి పార్టీలో అభ్యర్ధులను ఖరా రు చేయాలని అధినేత జగన్‌ సీరియస్‌గా దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. ఈక్రమంలోనే అటు ఇంటి లిజెన్స్‌ ఇటు ఐప్యాక్‌ ఇచ్చే సమాచారం తోపాటు దాదాపుగా 6 సర్వే సంస్థలతో నియో జకవర్గాల్లో అమాత్యుల పనితీరుపై వారికి తెలియ కుండానే స మాచారాన్ని సేకరిస్తున్నట్లు తెలు స్తోంది. ఇప్పటికే ఈ సర్వే సంస్థలు రెండు దఫా లుగా అధినేతకు స మాచారం అందించాయాని, దసరా నాటికి మరో రెండు మూడు దఫాలుగా నివేదికలు ఇస్తాయని అంటున్నారు. మొత్తంగా చూస్తే దసరా నాటికి అభ్యర్ధుల ఎంపిక దాదాపుగా ఖరారయ్యే అవకా శాలు స్పష్టంగా కనిపిసు ్తన్నాయి. ప్రస్తుతం రాష్ట్రం లోని 175 నియోజ కవర్గాల పరిధిలో 36 మంది అభ్యర్ధుల పనితీరు ఆశించిన స్థాయిలో లేదని గుర్తించినట్లు సమా చారం. వీరు దసరా లోపు తమ పని తీరును మెరు గుపర్చుకుంటే అవకాశం కల్పించే యోచనలో అధినేత ఉన్నట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement