అమరావతి,ఆంధ్రప్రభ: ఒకప్పుడు రద్దు చేయాలని తీర్మాని ంచిన మండలి ఇప్పుడు అధికార వైకాపాలో పండుగ వాతా వరణం నెలకొల్పుతోంది. దీంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేతృత్వంలోని అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి ఆధిపత్యాన్ని సాధించడానికి సిద్ధమౌతోంది. ఎమ్మెల్యే కోటాలో ఏడు, స్థానిక సంస్థల కోటా తొమ్మిది సహా మొత్తం 23 ఎమ్మెల్సీ స్థానాలను గెలుచుకునేం దుకు ముఖ్యమంత్రి వ్యూహాలు రచిస్తున్నారు. ‘టార్గెట్ 175’ కింద 2024 అసెంబ్లీ ఎన్నికలకు వెళుతున్న వైఎ స్సార్సీపీ శాసన మండలిలో ప్రబలమైన శక్తిగా ఎదుగ బోతోంది. ఇదే సమయంలో గతంలో మండలిలో ఆధిక్యత చాటుకున్న తెలుగుదేశం బలం ఇప్పుడు కేవలం నాలుగు సీట్లకే పరిమితం కానున్నది. దీంతో ఒకప్పుడు పరాభవం చవిచూసిన మండలిలో ఇప్పు డు అదే పార్టీ అత్యంత బలంగా మారనుంది. ఇప్పుడిది రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
బలాబలాలు ఇలా
ప్రధానంగా వివిధ కారణాల వల్ల గత మూడేళ్లుగా ఎలాంటి పదవులు ఇవ్వని పలువురు నేతలకు ఎమ్మెల్సీలుగా అవకాశం ఇవ్వాలని జగన్ ఆలోచిస్తున్నా రు. ఈఏడాది మార్చి 29 నాటికి 14 ఎమ్మెల్సీ స్థానాలు, మే 1నాటికి ఏడు స్థానాలు, జూలై 20 నాటికి మరో రెండు స్థానాలు కలిపి మొ త్తం 23 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవనున్నాయి. ప్రస్తుతం వైఎ స్‌ఆర్‌సీపీకి 25 ఎమ్మెల్సీలు ఉండగా, టీ-డీపీకి 15 ఎమ్మెల్సీలు ఉన్నాయి. ఇక ఎనిమిది మంది నామినే-టె-డ్ సభ్యులు, పీడీఎఫ్‌కు 4, స్వతంత్రులు 4, బీజేపీకి ఒక స్థానం ఉండగా, ఒక స్థానం ఖాళీగా ఉంది. ఖాళీ కానున్న స్థానాల్లో ఐదు వైఎస్సార్‌సీపీ సీట్లు-, 11 టీ-డీపీ సీట్లు-, రెండు బీజేపీ సీట్లు-, ఎమ్మెల్యే కోటా కింద ఎన్ని-కై-నవి, గవర్నర్ నామినేషన్‌లో ఉన్నవి ఉన్నాయి. వైఎస్సార్‌సీపీకి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక తెలుగుదేశం నుండి నలుగురు ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారు. దీంతో వైయస్సార్‌సీపీ అసెంబ్లీలో బలం పుంజుకుంది. 90 శాతం స్థానిక సంస్థలను కూడా వైఎస్సార్‌సీపీ -కై-వసం చేసుకుంది. వైఎస్‌ఆర్‌సిపి తన ఐదు స్థానాలను నిలుపుకోవడమే కాకుండా తెలుగుదేశం నుండి 11, బిజెపికి చెందిన రెండు మరియు గవర్నర్ కోటా నుండి ఒకటి -కై-వసం చేసు కోనుంది. దీంతో గతంలో మండలిలో మెజారిటీ- ఉన్న టీడీపీకి యనమల రామ కృష్ణుడు, పీ అశోక్ బాబు, డీ రామారావు, తిరుమల నాయుడు అనే నలుగురు సభ్యు లు మాత్రమే మిగలనుండగా టీ-డీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌తో పాటు- మరో పది మంది ఎమ్మెల్సీలు పదవీ విరమణ చేయనున్నారు.
ఉపాధ్యాయ, పట్టభద్రుల స్థానాలకూ బరిలో…
పట్టభద్రుల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు పార్టీ అభ్యర్థులను జగన్ ప్రకటించా రు. ఉపాధ్యాయ నియోజకవర్గాలకు కూడా తమ అభ్యర్థులను బరిలోకి దింపాలని వైఎస్సార్‌సీపీ యోచిస్తోంది. రాష్ట్రంలో అధికార పార్టీకి అత్యధిక మెజారిటీ- రావ డంతో వాటిని -కై-వసం చేసుకోవాలని భావిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలుగా పోతుల సునీత, డొక్కా మాణిక్యవరప్రసాద్‌రావులను కొనసాగించే అవకాశం ఉం ది. గ్రూపు రాజకీయాలు తారాస్థాయికి చేరిన నియోజకవర్గాల్లోని కుల సమీకరణలు, సర్దుబాట్లను దృష్టిలో ఉంచుకుని సీట్లను భర్తీ చేయనున్నట్టు- విశ్వసనీయ వర్గాల సమాచారం. విజయవాడ తూర్పు నుంచి దేవినేని అవినాష్, మండపేట నుంచి తోట త్రిమూర్తులు, పర్చూరు నుంచి ఆమంచి కృష్ణమోహన్‌లను ఆయా నియోజకవ ర్గాలకు ఇన్‌చార్జ్‌లుగా నియమించారు. దీంతో ఎమ్మెల్సీలుగా వీరు పోటీలో ఉండే అవకాశం లేదు. ఇక ఎమ్మెల్సీ రేసులో ఉన్న బొప్పన భవకుమార్, పట్టాభిరామయ్య చౌదరి, రావి రామనాథం బాబులకు నామినే-టె-డ్ పదవులు ఇస్తామని హామీ ఇచ్చి నట్లు- సమాచారం. ఎమ్మెల్సీ పదవుల కోసం. సీనియర్ నేతలకు అవకాశం కల్పించి మిగిలిన ఎమ్మెల్సీ స్థానాలను కూడా భర్తీ చేయనున్నారు. ఇలా రద్దు చేద్దామని అనుకున్న మండలి ఇప్పుడు వైఎస్సార్సీ నేతలకు ఈ పదవులు దక్కేలా చేస్తోంది.