ఏపీలో అధికార వైసీపీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలు ఏకం కావాల్సిన అవసరం ఉందన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలపై అధికార వైసీపీ స్పందించింది. చంద్రబాబుకు పొత్తులేమీ కొత్త కాదని నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు అన్నారు. జగన్‌ను ఎదుర్కొనే దమ్ము చంద్రబాబుకు లేదన్నారు. ఒంటరిగా పోటీ చేసే దమ్ము ఒక్క జగన్‌కే ఉందని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు ప్రజలే బుద్ది చెబుతారన్న ప్రసాదరాజు… 2024లో టీడీపీకి 23 సీట్లు కూడా రావంటూ వ్యాఖ్యానించారు.
జగన్‌ను ఎదుర్కొనే దమ్ము చంద్రబాబుకు లేదు: వైసీపీ ఎమ్మెల్యే సవాల్
Advertisement
తాజా వార్తలు
Advertisement