Sunday, November 24, 2024

ఏడాదికి రెండుసార్లు ‘లా నేస్తం’ .. సీఎం జ‌గ‌న్

ఇకపై ఏడాదికి రెండుసార్లు వైయ‌స్ఆర్‌ ‘లా నేస్తం’ అమ‌లు చేస్తామ‌ని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌క‌టించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం వైయస్‌ఆర్‌ లా నేస్తం పథకం ద్వారా నిధులను సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి విడుదల చేశారు. జూనియర్‌ న్యాయవాదుల ఖాతాల్లో కోటి 55 వేలు సీఎం వైయస్‌ జగన్‌ జమ చేశారు. ఈ సందర్భంగా వర్చువల్‌గా సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి జూనియర్‌ లాయర్లతో మాట్లాడారు. లాయర్లకు ప్రభుత్వం తోడుగా ఉందని తెలిపేందుకే వైయస్‌ఆర్‌ లా నేస్తం పథకాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు.

లా డిగ్రీ అందుకున్న విద్యార్థులు న్యాయవాదిగా స్థిరపడేందుకు లా నేస్తం కచ్చితంగా ఉపయోగపడుతుందని తెలిపారు. గత మూడేళ్లుగా లా నేస్తం నిధులు విడుదల చేస్తున్నామని, మూడున్నరేళ్లలో 4,248 మంది లాయర్లకు లా నేస్తం అందించామని పేర్కొన్నారు. పాదయాత్రలో ఇచ్చిన మాటను నెరవేరుస్తూ అడుగులు ముందుకు వేస్తున్నానన్నారు. ప్రతి అడ్వకేట్‌కు కూడా ఒకే ఒక మాట చెబుతున్నాను. ది వెపన్‌ ఆఫ్‌ ది అడ్వకేట్‌ ఈ దీస్‌ సోడ్‌ ఆఫ్‌ ది సోల్జర్‌.. నాట్‌ ది బాగర్‌ ఆఫ్‌ ది అససినెట్‌.. అంటే న్యాయవాది చేతిలో ఉన్న ఆయుధం.. సైనికుడి చేతిలో ఉండే తుపాకి వంటిది. హంతకుడి చేతిలో ఉండే బాకు లాంటిది కాదన్నారు. దీన్ని కొంచెం మార్పు చేస్తూ మీ అందరికీ ఒక్కటే రిక్వేస్ట్‌ చేస్తున్నానని సీఎం జ‌గ‌న్ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement