పేద కుటుంబాల్లో పిల్లల్ని చదువలకు మరింత ఊతమిచ్చేలా అమలు చేస్తున్న.. వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా పథకాల్లో భాగంగా నిధులను నేడు విడుదల చేయనున్నారు.
2023 అక్టోబర్- డిసెంబర్ త్రైమాసికంలో వివాహాలు చేసుకున్న 10,132 అర్హులైన జంటలకు వైఎస్సార్ కళ్యాణమస్తు”, “వైఎస్సార్ షాదీ తోఫా” క్రింద రూ.78.53 కోట్ల ఆర్థిక సాయాన్ని సీఎం జగన్ క్యాంప్ కార్యాలయం నుంచి బటన్ నొక్కి వధువుల తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు.
- Advertisement -
పేద తల్లిదండ్రులు తమ పిల్లలను చదివించి, వారి వివాహాన్ని గౌరవ ప్రదంగా జరిపించేలా వారికి అండగా నిలుస్తూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, దివ్యాంగులు, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల్లోని ఆడపిల్లలకు “వైఎస్సార్ కళ్యాణమస్తు” ద్వారా ఆర్ధిక సాయం అందిస్తున్నారు. మైనార్టీ వర్గాల ఆడపిల్లలకు “వైఎస్సార్ షాదీ తోఫా” ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నారు.