మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్‌పై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. హత్య కేసులో A2గా ఉన్న సునీల్ యాదవ్‌కు బెయిల్ ఇవ్వొద్దంటూ వివేకా కుటుంబం అభ్యంతరం తెలిపింది. వివేకానందరెడ్డి భార్య సౌభాగ్యమ్మ హైకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ దశలో బెయిల్ మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని కోర్టుకు సౌభాగ్యమ్మ తెలిపారు. ఈనెల 27న సునీల్ బెయిల్ పిటిషన్‌పై, అభ్యంతరాలపై వాదనలు జరుగనున్నాయి. ఈ క్రమంలో తదుపరి విచారణను హైకోర్టు ఈనెల 27కు వాయిదా వేసింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement