Sunday, November 24, 2024

సీబీఐ అధికారులను కలిసిన వివేకా కుమార్తె

మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు విచారణను సీబీఐ వేగవంతం చేసింది. ఈ కేసు విచారణ పులివేందులలో కొనసాగుతున్న వేళ.. వివేకా కుమార్తె సునీతా రెడ్డి, అల్లుడు రాజశేఖర్ రెడ్డి ఆదివారం పులివెందులలో సీబీఐ అధికారులను కలిశారు. ఆర్ అండ్ గెస్ట్ హౌస్ కు వెళ్లిన సునీతా రెడ్డి దంపతులు సీబీఐ అధికారులతో మాట్లాడారు. కేసుకు సంబంధించిన అంశాలపై చర్చించారు.

ఈ కేసులో నిందితుడు సునీల్ యాదవ్ ను అరెస్ట్ చేసి విచారిస్తున్న సీబీఐ అధికారులు.. ప్రస్తుతం వివేకా హత్యలో వాడిన ఆయుధాలను కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నారు. కడప జిల్లా పులివెందుల రోటరీపురం వాగులో సీబీఐ అధికారులు రెండో రోజు ఆయుధాల కోసం అన్వేషించారు. ట్యాంకర్ల సాయంతో వ్యర్ధపు నీటిని మున్సిపల్ సిబ్బంది తీశారు. బురద ఎక్కువగా ఉండడంతో ఆయుధాల దొరికేందుకు మరింత ఆలస్యం అయ్యే ఛాన్స్  ఉన్నట్టు తెలుస్తోంది. ఆయుధాలను స్వాధీనం చేసుకున్న తర్వాత విచారణ కొనసాగించే అవకాశం ఉంది. ఆయుధాల దొరికిన తర్వాత సునీల్‌ యాదవ్‌ను మరింత లోతుగా విచారించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. వివేకా హత్య కేసు అనుమానితులను అధికారులు విచారిస్తున్నారు. ఇప్పటికే వాచ్‌మెన్‌ రంగన్న, ఉదయకుమార్ రెడ్డి, ఇనయతుల్లా, ప్రకాష్ రెడ్డి విచారణకు హాజరైయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement