వైఎస్ వివేకా హత్యకేసు విచారణ తెలంగాణకు సుప్రీంకోర్టు బదిలీ చేసింది. వివేకా కుమార్తె సునీత పిటిషన్ పై సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ బీవీ నాగరత్న ధర్మాసనం తీర్పు వెల్లడించింది. హైదరాబాద్ సీబీఐ స్పెషల్ కోర్టుకు సుప్రీంకోర్టు బదిలీ చేసింది. హత్య కేసులో సాక్ష్యాధారాలు ధ్వంసం చేసినట్లు ఆధారాలున్నాయని సుప్రీంకోర్టు తెలిపింది. విచారణపై వివేకా కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారని సుప్రీంకోర్టు తెలిపింది. వివేకా కుటుంబ సభ్యుల ప్రాథమిక హక్కులకు భంగం కలగకూడదని సుప్రీంకోర్టు తెలిపింది.
Breaking: వైఎస్ వివేకా హత్యకేసు విచారణ తెలంగాణకు బదిలీ
Advertisement
తాజా వార్తలు
Advertisement