Friday, November 22, 2024

వివేక హత్య కేసులో సీబీఐ ని ఆరా తీసిన సునీత

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. అయితే వివేక కుమార్తె సునీత ఈ రోజు కడపలో సీబీఐ అధికారులను కలిశారు. తన తండ్రి హత్య కేసు విచారణలో పురోగతిని ఆమె అడిగి తెలుసుకున్నట్టు సమాచారం. ఇటు 73వ రోజు విచారణ సందర్భంగా కడప సెంట్రల్ జైలు గెస్ట్ హౌస్ లో సునీల్ యాదవ్ బంధువు భరత్ యాదవ్ ను సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. వివేకా పొలం పనులను చూసిన సుంకేసుల గ్రామానికి చెందిన జగదీశ్వర్ రెడ్డితో పాటు ఓ పోలీస్ కానిస్టేబుల్ నూ విచారణకు పిలిచారు. పులివెందులకు చెందిన మహబూబ్ బాషా, నాగేంద్ర అనే వ్యక్తితో పాటు హత్యలో అనుమానితుడిగా ఉన్న మరో వ్యక్తి కూడా హాజరయ్యారు.

మరోపక్క, అనుమానితులను కడపలో అధికారులు విచారిస్తున్నారు. పులివెందుల ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో ఎంపీ అవినాశ్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి, ఆయన బాబాయి మనోహర్ రెడ్డి, వివేకానందరెడ్డి అనుచరుడు ఎర్ర గంగిరెడ్డిలను విచారణకు పిలిపించారు. ఈ నేపథ్యంలోనే హత్యకు సంబంధించిన వివరాలేమైనా వెల్లడయ్యాయో లేదో తెలుసుకునేందుకు ఆమె సీబీఐ అధికారులను కలిసినట్టు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: సామాన్యుడిపై బండ.. వంట గ్యాస్ సిలిండ‌ర్ల ధ‌ర‌ల పెంపు

Advertisement

తాజా వార్తలు

Advertisement