కడప – కడప వైసిపికి, ఆ పార్టీ అధినేత జగన్ కు పెట్టని కోట..ఇంత వరకు ఆ కోటలో ఎన్నడూ టిడిపి పాగా వేసింది లేదు..ఈ సారి ఎలాగైనా కడప లోక్ సభ స్థానంతో పాటు పులివెందుల అసెంబ్లీ సీటును గెలుచుకోవాలని పసుపు పార్టీ పాచికలు వేస్తున్నది.. ఒక రకంగా వైఎస్ వివేక హత్య కేసులో జగన్ అండ్ కో పాత్ర ఉందని కడప ప్రజలు బలంగా నమ్ముతున్నారు.. అజాతశత్రువుగా పేరున్న వివేకాను స్వంత కుటుంబం వారే హత్య చేసి ఉంటారని సిబిఐ తో పాటు వైఎస్ రాజశేఖరరెడ్డి అభిమానులు భావిస్తున్నారు.. దీంతో అక్కడ వైసిపి రోజు రోజుకి బలహీనపడుతున్నది.. ఒక్కో నాయకుడు ఫ్యాన్ కు దూరమవుతున్నారు.. వివేకా కేసులో ఎంపి అవినాష్ రెడ్డితో పాటు అతని తండ్రి భాస్కరరెడ్డి పాత్ర ఉందని సిబిఐ పేర్కొనడం, ఆ వెంటనే భాస్కర రెడ్డి అరెస్ట్ చేయడంతో ఫ్రాన్ గ్రాఫ్ ఒక్కసారిగా పాతాళానికి పడిపోయినట్లు టిడిపి అంటున్నది.. . .
వైసీపీకి పెద్ద దిక్కుగా బలమైన నేతగా ఉన్న వైఎస్ భాస్కరరెడ్డి అరెస్ట్ తో ఇపుడు వైసీపీకి పెద్ద దెబ్బ పడింది అని అంటున్నారు. ఇంకో వైపు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్ట్ కూడా అయితే వైసీపీకి కడప జిల్లాలో రాజకీయ మనుగడ ప్రశ్నార్ధకంగా మారే అవకాశాలున్నాయి.. వాస్తవానికి జగన్ సీఎం గా ఉన్న కడప జిల్లా రాజకీయాలను మొత్తం వైఎస్ భాస్కరరెడ్డి అవినాష్ రెడ్డి లే ప్రభావితం చేస్తున్నారు. వారు కంట్రోల్ లోనే అక్కడ మొత్తం పార్టీ నడుస్తోంది. ఆ ఇద్దరి ఇమేజ్ పడిపోవడంతో ఆ ఆవకాశాన్నిఅందిపుచ్చుకోవాలని చంద్రబాబు నాయుడు ప్రణాళికలు రచిస్తున్నారు.
ఈసారి కడప ఎంపి, పులివెందుల అసెంబ్లీ సీట్లు ఇప్పడు గెలవలేకపోతే ఇంకేప్పుడు గెలవలేమని నిర్ణయానికి వచ్చేసింది.. ఇప్పటికే పులివెందుల సీటుకు ఎమ్మెల్సీ బిటెక్ రవిని సిద్ధం చేసింది.. ఇప్పుడు ఎంపి సీటు అభ్యర్ధిపై కసరత్తు చేస్తున్నది..
కడపలో వివేక హత్య తర్వాత సునీత పట్ల అక్కడి ప్రజలలో అంతులేని సానుభూతి వ్యక్తమవుతున్నది.. దీనిని ఆధారం చేసుకుని వైసిపి అభ్యర్ధి వైఎస్ అవినాష్ రెడ్డిపై వైఎస్ సునీతను నిలపాలని భావిస్తున్నది. ఇదిలా ఉంటే వైఎస్ వివేకా హత్య కేసులో న్యాయం కోసం పోరాడుతున్న సునీతకు తెలుగుదేశం పార్టీ నుంచి పరోక్ష మద్దతు ఇస్తున్నది. పులివెందుల టీడీపీ ఇంచార్జి బీటెక్ రవి వైఎస్ సునీత భర్త రాజశేఖరెడ్డి ఇద్దరూ కూడా మంచి దోస్తులు కావడంతో ఈ దోస్తీ వైసీపీకి ఇబ్బందికరంగా మారుతోందని అంటున్నారు. తన తండ్రి కోసం న్యాయ పోరాటం చేస్తున్న సునీత రాజకీయ పోరాటం కూడా చేయాలన్నది టీడీపీ అలోచనగా ఉంది. ఇదిలా ఉంటే వైఎస్ వివేకాను మంచి పేరు కడప అంతటా ఉంది. ఆయన అనేక దఫాలు ఎంపీగా పనిచేశారు. దాంతో ఆయనకు విస్తౄతమైన పరిచయాలు ఉన్నాయి. ఆయన దారుణ హత్యను జిల్లా ప్రజానీకం అసలు మరచిపోవడంలేదు. దాంతో సునీత పట్ల పెద్ద ఎత్తున సానుభూతి అయితే ఉంది. ఆమె రాజకీయాల వైపు అడుగులు వేయాలి కానీ కచ్చితంగా గెలుపు ఆమె సొంతం అవుతుందన్న అంచనాలు ఉన్నాయి.
అయితే ఆ మధ్య మీడియాతో మాట్లాడిన సునీత తనకు రాజకీయాల పట్ల ఆసక్తి లేదని తేల్చేశారు. తన పోరాటం అంతా తన తండ్రిని చంపిన వారిని పట్టుకుని సరైన శిక్ష పడేలా చేయడమే అని అంటున్నారు. అయితే అయితే సునీతకు రాజకీయ ఆకాంక్ష లేకపోయినా ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖరెడ్డికి మాత్రం ఉందని అంటున్నారు. అందువల్ల మరో ఏడాదిలో జరిగే కడప ఎంపీ ఎన్నికల్లో కచ్చితంగా సునీత నిలబడేలా చేయడంతో సర్రెడ్డి రాజశేఖరెడ్డి కీలకమైన పాత్ర పోషిస్తారని టిడిపి అ వైపు నుంచి నరుక్కుంటూ వస్తున్నది.. బిటెక్ రవి ద్వారా రాజశేఖర్ రెడ్డిపై వత్తిడి తెచ్చి సునీతను కడప పార్లమెంట్ కు పోటీ చేయించాలని దృడంగా ఉంది.. అదే కనుక జరిగితే ఆ ప్రభావం మొత్తం కడపలోని ఏడు అసెంబ్లీ సీట్ల మీద పడుతుంది. వైఎస్ వివేకా సానుభూతి పవనాలతో వైసిపికి కడప జిల్లా వ్యాప్తంగా ఎదురుదెబ్బ ఖాయమని అక్కడి టిడిపి నేతలు విశ్లేషిస్తున్నారు.
కడప ఎంపి టిడిపి అభ్యర్ధిగా వైఎస్ సునీత?
Advertisement
తాజా వార్తలు
Advertisement