Monday, November 25, 2024

Anakapalli: ఫార్మా బాధితులకు జగన్‌ పరామర్శ

తక్షణమే పరిహారం చెల్లించాలి
ఇవ్వకపోతే నేనే ధర్నా చేస్తా
ప్రభుత్వ స్పందన దారుణం
పక్కదారి మళ్లింపుపైనే తాపత్రయం
బాధితులకు అండగా ఉంటా
అనకాపల్లిలో వైసీపీ అధినేత జగన్

ఆంధ్రప్రభ స్మార్ట్, విశాఖపట్నం ప్రతినిధి : అచ్యుతాపురం సెజ్ లో దుర్ఘటనలో చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరించిన తీరు బాధాకరమని వైఎస్. జగన్ మోహన్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఉదయం అనకాపల్లిలోని ఉషా ప్రైమ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల్ని పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, అచ్యుతాపురం ఘటనలో ప్రభుత్వ తీరు సరికాదు. ఘటన జరిగింది రాత్రి కాదు పట్టపగలు. -ఈ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. పర్యవేక్షణకు వెళుతున్నట్టు హెూం మంత్రి అన్న మాటే -. కార్మిక శాఖ మంత్రి కూడా తన దగ్గర ప్రమాదం వివరాలు లేవన్నారు. ఎంత మంది చనిపోయారో తెలియదన్నారు. ఈ ఘటనపై స్పందించకూడదనే తాపత్రయం ప్రభుత్వంలో కనిపించింది అని వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఘటనా స్థలానికి ఆంబులెన్సులు కూడా రాని పరిస్థితి, బాధితుల్ని కంపెనీ వాహనాల్లో తీసుకొచ్చారు.

గంటల వ్యవధిలోనే స్పందించాం

ఇలాంటి ఘటనే మా హయాంలో జరిగింది. అదీ కోవిడ్ సమయంలో. ఎల్జీ పాలీమర్స్ ఘటనలో 24 గంటల్లోపే పరిహారం ఇప్పించాం. కోటి రూపాయల పరిహారం ఇచ్చిన తొలి ప్రభుత్వం మాదే. అప్పుడు ప్రమాదం జరిగిన వెంటనే పాలక, ప్రభుత్వ యంత్రాంగం స్పందించింది. తెల్లవారుజామున ప్రమాదం జరిగిన కాసేపటికే కలెక్టర్ ఘటనా స్థలానికి వెళ్లారు. నేనే ఉదయం 11 గంటలకు ప్రమాద స్థలానికి వెళ్లాను. గంట్లలోనే రూ.30 కోట్లు పరిహారం సొమ్ము పంపించాం. గతంలో ఏ ప్రభుత్వం మా ప్రభుత్వంలా స్పందించలేదు. అని జగన్ మోహన్ రెడ్డి వివరించారు.

బాధితులకు అండగా ఉంటాం

ఇప్పుడు ఈ ప్రభుత్వం స్పందించిన తీరు బాధగా అనిపిస్తోందని. ఈ ఫ్యాక్టరీలో ప్రమాదంలో ఎలా జరిగిందో లోతైన దర్యాప్తు చేయాలని జగన్ డిమాండ్ చేశారు. పరిహారం అనేది సానుభూతితో ఇవ్వాలి. తగిన సమయంలో ఇవ్వాలి. ఇప్పటివరకు ఒక రూపాయి ముట్టలేదు. ఇవ్వాల్సిన పరిహారం వెంటనే ఇవ్వాలి. పరిశ్రమల్లో ప్రమాదాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోండి. ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. బాధితులకు పరిహారం ఇవ్వకపోతే నేను వచ్చి. స్వయంగా ధర్నా చేస్తాను. బాధితులకు అండగా ఉంటాను. అని ప్రభుత్వానికి జగన్ మోహన్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement