Monday, November 18, 2024

ఎంపి అవినాష్ రెడ్డి తండ్రి భాస్కరరెడ్డి అరెస్ట్ ..

కడప, బ్యూరో,ప్రభన్యూస్ – వివేక హత్య కేసు విచారణ లో దూకుడు పెంచిన సిబిఐ అరెస్టుల పర్వానికి దిగింది. మూడు రోజుల క్రితం ఈ కేసులో అనుమానితుడైన గజ్జల ఉదయభాస్కర్ ని అరెస్ట్ చేసిన సిబిఐ తాజాగా కడప ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రిని అదుపులోకి తీసుకుంది. ఆదివారం తెల్లవారుజామునే పులివెందుల చేరుకున్న సిబిఐ బృందం అవినాష్ నివాసానికి చేరుకుంది.ఉంట్లో ఉండే మిగతా వారిని బయటకు పంపి సుమారు గంటన్నర పాటు సిబిఐ అవినాష్ ఇంట్లోనే భాస్కర్ రెడ్డిని విచారించినట్లు సమాచారం.విచారణ అనంతరం మెమో జారీ చేసి భాస్కర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఆయన్ను సిబిఐ ఇంటి నుంచి బయటకు తీసుకొస్తుండగా అక్కడే బయట ఉన్నవారు ఒక్కసారిగా గేటు వద్దకు చేరుకున్నారు. వారిని అడ్డు తొలగించి భాస్కర్ రెడ్డిని వాహనంలోతీససికెళ్ళారు.బాస్కర్ రెడ్డిని కడపకు తీసుకొస్తున్నారు సమాచారం. ఇప్పటికే పలుమార్లు అవినాష్ రెడ్డిని, ఒకటి రెండుసార్లు భాస్కర్ రెడ్డిని సిబిఐ పోలీసులు విచారించారు.వీరిని సిబిఐ అరెస్ట్ చేస్తారని భావిస్తూ వచ్చారు.ఈ నేపథ్యంలో అవినాష్ తండ్రి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ పరిణామం పులివెందులలో కలకలం రేపుతోంది. వివేక హత్య కేసులో ఇప్పటివరకు అరెస్ట్ చేసిన వారిది ఒక అంశం అయితే ముఖ్యులుగా ఉన్న వారిని అరెస్ట్ చేసే క్రమంలో ఎంపి తండ్రి వైయస్ భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేయడం వైయస్ కుటుంబంలోనూ కలకలం రేగుతుంది. సిబిఐ అరెస్ట్ ల పర్వానికి దిగిన నేపథ్యంలో విచారణ త్వరలోనే ఓ కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement