తెలుగు యువతకు నేను ఐటీ అనే ఆయుధం ఇచ్చానని, కానీ జగన్ మాత్రం నిరుద్యోగంలో నెంబర్ వన్ స్థానం ఇచ్చాడని టీడీపీ అధినేత చంద్రబాబా ధ్వజమెత్తారు. తిరువూరులో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన జగన్ ప్రభుత్వం పై మండిపడ్డారు. టమోటోకి, పొటాటోకి తేడా తెలియని సీఎం అని విమర్శించారు.
ఇప్పుడు హైదరాబాద్ వెలిగిపోతుంటే.. అమరావతి వెలవెలపోతోంది. రాష్ట్రం ఇలా అవటానికి సీఎం జగన్ రివర్స్ పాలనే. జగన్ రాష్ట్రాన్ని 30 ఏళ్లు వెనక్కి తీసుకు వెళ్లాడు. సీఎం జగన్ రివర్స్ పాలనలో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కిపోయిందన్నారు. దుర్మార్గుడు పాలిస్తే రాష్ట్రం కోలుకోలేని విధంగా దెబ్బతిందని మండిపడ్డారు. అప్పుల్లో రాష్ట్ర రైతులు అగ్రస్థానంలో ఉన్నారని, కౌలు రైతుల ఆత్మహత్యల్లో ఏపీ రెండో స్థానంలో ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు ‘రా.. కదిలిరా’ అని పిలుపునిస్తున్నా అని అన్నారు. జగన్ ఓ దుర్మార్గుడు. రాష్ట్రంలో అందరూ జగన్ బాధితులే. నేను కూడా బాధితుడినే. జగన్ అరాచక పాలనకు చరమగీతం పాడాలి’ అని అన్నారు.