ఏపీలో మరో దారుణం జరిగింది. విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో సామూహిక లైంగిక దాడి ఘటనను మరచిపోకముందే ఓ ఉన్మాది యువతి గొంతుకోసం తీవ్రంగా గాయపరిచాడు. అనకాపల్లి జిల్లాలో వి.మాడుగులో ఈ ఘటన చోటు చేసుకుంది. నగేశ్ అనే యువకుడు బ్లేడ్‌తో యువతి గొంతుకోసి పరారయ్యాడు . దీంతో యువతికి తీవ్రగాయాలయ్యాయి. ఆమెను కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడి కోసం గాలిస్తున్నారు.
కాగా, బాధిత యువతిని ప్రేమిస్తున్నానంటూ కొంత కాలంగా నగేశ్ వెంటపడుతున్నాడు. అయితే అందుకు యువతి ఒప్పుకోకపోవడంతోనే నగేశ్ ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.