Friday, November 22, 2024

AP : మీ నిర్ణయాలు మీ చేతుల్లో లేవు.. పవన్‌కు ముద్రగడ ఘాటు లేఖ..

మీ నిర్ణయాలు మీ చేతుల్లో లేవు అంటూ కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను ఎద్దేవా చేశారు. ఇవాళ ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు ముద్ర‌గ‌డ ఘాట లేఖ‌ను రారు. పవన్‌ నమ్మంచి మోసం చేశాడని సీరియస్‌ అయ్యారు.

- Advertisement -

ఈ లేఖలో ముద్రగడ్ర..’రెండు పర్యాయాలు కిర్లంపూడి వస్తానని మీరు నాకు కబురు పంపారు. ఎలాంటి కోరికలు లేకుండా మీతో కలుస్తానని చెప్పడం జరిగింది. అన్ని వర్గాలకు న్యాయం చేయాలని ఆశించి మీతో కలిసి సేవ చేయాలనుకున్నాను. కానీ మీరు నన్ను కలవడానికి మీకు ఎన్నో చోట్ల అనుమతులు అవసరం. మీ నిర్ణయాలు మీ చేతుల్లో లేవు. పవర్ షేరింగ్ అనేది లేదని అర్ధమైంది.

మీ 24 సీట్ల కోసం నా అవసరం రాదు.. రాకూదనే భగవంతున్ని కోరుకుంటున్నాను. మీలా గ్లామర్ ఉన్నవాన్ని కాకపోచ్చు. ప్రజల్లో పరపతి లేకపోవడం వల్ల మీ దృష్టిలో లాస్ట్ గ్రేడ్ వ్యక్తిగా తుప్పు పట్టిన ఇనుములా గుర్తించారు. నా 40 ఏళ్ల​ రాజకీయ జీవితంలో డబ్బు కోరడం గానీ.. పదవులు కోసం పెద్ద నాయకుల గుమ్మాల వద్ద పడిగాపులు కాయడం చేయలేదు’ అంటూ తీవ్ర విమర్శలు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement