Friday, November 22, 2024

AP: పరీక్ష కోసం సాహసం.. ఉప్పొంగి ప్రవహిస్తున్న చంపావతి నది దాటిన యువతి

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం విజయనగరంలో ఓ 21 ఏళ్ల యువతి పరీక్ష రాయడానికి సాహసం చేసిందనే చెప్పాలి. భారీవర్షాలకు రోడ్డు మార్గాన సౌకర్యాలు లేకపోవడం, వాహనాల రాకపోకలు నిలిచిపోవడంతో ఉప్పొంగి ప్రవహిస్తున్న చంపావతి నదిని ఈదుతూ ఇవతలి ఒడ్డుకు వచ్చింది.

‌‌- డిజిటల్​ మీడియా, ఆంధ్రప్రభ

గజపతినగరం మండలం మర్రివలస గ్రామానికి చెందిన తాడి కళావతి అనే యువతి తన ప్రాణాలను పణంగా పెట్టి తన ఇద్దరు సోదరుల సహాయంతో శనివారం జరగాల్సిన పరీక్షకు హాజరయ్యేందుకు వరద ముంచెత్తుతున్నా వదలిపెట్టకుండా చంపావతి నదిని దాటింది.

కాగా, దీనికి సంబంధించిన 33 సెకన్ల నిడివి గల ఓ వీడియో ఒకటి ఇప్పుడు సోషల్​ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇది మన్యం జిల్లాల్లో ఉండే పరిస్థితులను కళ్లకు కడుతోంది అని చాలామంది కామెంట్స్​ చేస్తున్నారు. ఈ వీడియోలో కళావతి సోదరులు ఆమెను తమ భుజాలపై మోస్తూ నదికి మరొక వైపునకు తీసుకెళ్లడాన్ని చూడవచ్చు. ఆమె కూడా ప్రవహించే నీటిలో ఈదుతూ వారితోపాటే ఎంతో కష్టపడి దాటి వచ్చింది.

భారీ వర్షాల కారణంగా ఉత్తర కోస్తాలోని పలు నదులు పొంగిపొర్లుతున్నాయి. కళావతి ఎగ్జామ్​ సెంటర్​కు వెళ్లడానికి బస్సులు, ఇతర వాహనాలేవీ లేకపోవడం.. అన్ని రవాణా మార్గాలు నీటి ముంపులో ఉండడంతో ఇట్లా నదిలో నుంచి ఈదుతూ అవతలి ఒడ్డుకు చేరుకున్నారు. ఆమె పరీక్ష రాయాలంటే నదిని దాటించడమే ఏకైక మార్గమని ఆమె సోదరులు తనకు సహాయం చేశారు. ఇప్పుడు వారి సాహసాన్ని అంతా మెచ్చుకుంటున్నారు.

- Advertisement -

వీడియో కోసం www.prabhanews.com లోని వీడియోస్​ ట్యాబ్​లో చూడొచ్చు

Advertisement

తాజా వార్తలు

Advertisement