Wednesday, November 20, 2024

పోలీసులు వేధిస్తున్నారంటూ యువకుడు ఆత్మహత్య

తూర్పుగోదావరి జిల్లాలో విషాదం జరిగింది. పోలీసులు వేధిస్తున్నారంటూ ఓ యువకుడు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది.  తన చావుకి పోలీసులే కారణమని సెల్ఫీ వీడియో విడుదల చేసిన పిచ్చికి మజ్జి అనే యువకుడు… ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సంవత్సరం క్రితం తెలంగాణ నుండి రాజమహేంద్రవరంకు రెండు మద్యం బాటిల్స్ తీసుకుని వస్తుండగా జగ్గయ్యపేట దగ్గర ఉన్న చిల్లకల్లు పోలీసులు  అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో కొంత మొత్తంలో డబ్బు తీసుకుని మజ్జిని వదిలేశారు. అయితే, ఏడాది తర్వాత కానిస్టేబుల్ శివ ఫోన్ చేసి సెటిల్ చేసుకోకపోతే ఇబ్బంది పడతావు అని బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో చిలకల్లు వెళ్లిన బాధితుడికి కానిస్టేబుల్ శివ లక్ష రూపాయలు డిమాండ్ చేశారు. లేదంటే గంజాయి కేసు పెడతానని బెదిరించాడు. అనంతరం ఇంటికి తిరిగి వచ్చిన యువకుడు రాజమండ్రి రూరల్ పిడుంగొయ్య గ్రామంలో ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల వేధింపులు తట్టుకోలేకనే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు యువకుడు కుటుంబ సభ్యులు తన సెల్ఫీ వీడియోలో చెప్పాడు. 

ఈ సమాచారం తెలుసుకున్న ఎస్పి సిద్ధార్థ్ కౌశిల్ సీరియస్ అయ్యారు. తమ స్వప్రయోజనం కోసం ఒక యువకుడి నిండు ప్రాణం బలి కావడానికి కారణమైన కానిస్టేబుల్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆదేశించారు. అంతేకాదు విధుల నుంచి సస్పెండ్, అలాగే సిబ్బంది విధుల పట్ల సరైన పర్యవేక్షణ లేదనే కారణంగా చిల్లకల్లు ఎస్సైపై సస్పెన్షన్ వేటు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

ఇది కూడా చదవండి: హుజురాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్

Advertisement

తాజా వార్తలు

Advertisement