Wednesday, November 20, 2024

AP | పరుగు పరీక్షలో అవశ్రుతి.. యువకుడి మృతి

గుంటూరు సిటీ క్రైం, ప్రభ న్యూస్‌: గుంటూరు రేంజి పరిధికి సంబంధించి రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు గత 15 రోజులుగా గుంటూరు పోలీసు క్రీడా మైదానంలో జరుగుతున్న దేహదారుఢ్య పరీక్షల్లో శుక్రవారం గుం టూరు రూరల్‌ మండలం అంకిరెడ్డి పాలెంకు చెం దిన నేలపాటి మోహన్‌ కుమార్‌ (32) పాల్గొన్నారు. పరీక్షలో భాగంగా 1600 మీటర్ల పరుగు పందెంలో పాల్గొని చివరి సమయంలోయాసం వచ్చి వాంతులు చేసుకొని కుప్పకూలి పోయాడు.

అక్కడే ఉన్న పోలీసు సిబ్బంది అపస్మారక స్థితిలో పడి ఉన్న మోహన్‌ కుమార్‌ను వెంటనే చికిత్స నిమిత్తం అంబెలెన్స్‌లో గుంటూరు ప్రభుత్వాసుపత్రికి చేర్చారు. చికి త్స పొందుతూ మోహన్‌ కుమార్‌ మరణించాడు. ఇదిలా ఉండగా పరుగు పందెంలో పాల్గొన్న నేలపాటి మోహన్‌ కుమార్‌ బిటెక్‌ వరకు చదివి అనంతరం వ ట్టి చెరుకూరు మండలం యామర్రు సచివాలయంలో వెల్ఫేర్‌ కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తుండేవాడు.

జరిగిన ఎస్‌ఐ పరీక్షల కు హాజరై ఉత్తీర్ణత సాధించి దేహదారుఢ్య పరీక్షలకు అర్హత సాధించాడు. పరీక్షల్లో భాగంగా శుక్రవారం 1600 మీటర్ల పరుగు పందెంలో పాల్గొని చివరి సమయంలో పరుగెత్తలేక ఆయాసంతో ఆగి కొద్దిగా మంచినీరు తాగి వాంతులు చేసుకొని మైదానంలోనే కుప్ప కూలిపోయాడు. ఇది గమనించిన అక్కడే ఉన్న పోలీసు సిబ్బంది వెంటనే మోహన్‌ కుమార్‌ను అంబులెన్స్‌లో చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

- Advertisement -

చికిత్స పొందుతూ మోహన్‌ కుమార్‌ ప్రాణాలు విడిచాడు. విషయం తెలుసుకున్న మృతుని తల్లి నేలపాటి పద్మావతి బంధువులతో ప్రభుత్వాసుప్రతికి చేరుకొని చనిపోయిన తన కుమారుడిని చూసి భోరున విలపించిం ది. చేతికి అందివచ్చి కుటుంబాన్ని నడిపించాల్సిన కుమారుడే దూరమయ్యాడని తల్లి రోదించడం చూసి చూడడానికి వచ్చిన వారంత కన్నీరుపెట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement