టీమిండియా యువ క్రికెటర్ ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి ఈరోజు ఏపీ సీఎం చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా నితీశ్‌పై చంద్రబాబు ప్రశంసలు కురిపించారు. మరింత రాణించి రాష్ట్రానికి పేరు తీసుకురావాలని… రానున్న కాలంలో మరిన్ని శతకాలు, మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. నితీష్ కెరీర్‌ను మలచుకోవడంలో సహకరించిన తల్లిదండ్రులను అభినందించారు. ఈ సందర్భంగా చంద్రబాబు చేతుల మీదుగా నితీష్ కుమార్ రెడ్డి రూ.25 లక్షల చెక్కును అందుకున్నారు.
క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డిని అభినందించిన మంత్రి నారా లోకేష్
విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌తో నితీష్ కుమార్ రెడ్డి గురువారం ఉండవల్లిలోని ఆయన నివాసంలో ఆయన్ను కలిశారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డిని అభినందించి శాలువాతో సత్కరించి వెంకటేశ్వరస్వామి ప్రతిమను బహుకరించారు.
నితీష్ కుమార్ రెడ్డి తో మాట్లాడి తన క్రికెట్ విశేషాలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో యువ క్రీడాకారులకు సహకారం అందించాలని సూచించారు. అలాగే ఏసీఏ అధ్యక్షుడు ఎంపి కేశినేని శివనాథ్, ఏసీఏ కార్యదర్శి రాజ్య సభ ఎంపి సానా సతీష్ లతో క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. నితీష్ కుమార్ రెడ్డి భవిష్యత్తులో మరిన్ని విజయాలతో పాటు సరికొత్త రికార్డ్స్ సాధించాలని మంత్రి నారా లోకేష్ ఆకాంక్షించారు.