Monday, November 18, 2024

Delhi: కర్మ ఫలం అనుభవించాల్సిందే.. రాహుల్ ఈడీ విచారణపై విజయసాయి రెడ్డి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: కర్మ సిద్ధాంతం ప్రకారం ఎవరైనా సరే కర్మఫలం అనుభవించాల్సిందేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వి. విజయసాయి రెడ్డి అన్నారు. బుధవారం ఢిల్లీలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును కలిసిన అనంతరం ఆయన నివాసం వద్ద మీడియాతో మాట్లాడుతూ నేషనల్ హెరాల్డ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ విచారణ ఎదుర్కొంటున్న రాహుల్ గాంధీ వ్యవహారంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. పుణ్యం చేస్తే పుణ్య ఫలాలు, పాపం చేస్తే పాపఫలాలను ఈ జన్మలో లేదా వచ్చే జన్మలో అనుభవించాల్సిందేనని కర్మ సిద్ధాంతం చెబుతుందని ఆయన గుర్తుచేశారు.

రాజకీయ కక్షసాధింపు అనడం సరికాదు
ఈడీ దర్యాప్తును రాజకీయ కక్షసాధింపుగా కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణలపై కూడా విజయసాయి స్పందించారు. ఇది నేరుగా ప్రభుత్వం నమోదు చేసిన కేసు కాదని, సుబ్రహ్మణ్యస్వామి కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా, కోర్టు ఉత్తర్వుల మేరకు దర్యాప్తు సంస్థలు విచారణ చేపట్టాయని గుర్తుచేశారు. అలాంటప్పుడు దీన్ని రాజకీయ కక్షసాధింపు అనడం సరికాదని ఆయన సూత్రీకరించారు.

అధినేతదే తుదినిర్ణయం
మరోవైపు రాష్ట్రపతి ఎన్నికల వ్యవహారంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైఖరేంటన్న ప్రశ్నకు బదులిస్తూ.. ఈ విషయంలో తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement