అనంతపురం జిల్లాలో రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. చరిత్రలో కదిరి సమీపంలో ఉన్న ఎర్రదొడ్డి గంగమ్మ నీట మునిగింది. మొదటిసారి గంగమ్మ తల్లి కనిపించకుండా పోయింది. నీటి ఉద్ధృతికి గుడి కనిపించలేదు. ఆదివారం వస్తే వందలాది పొట్టేళ్లు గంగమ్మకు బలి ఇస్తారు. కర్ణాటక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించి వేలాది మంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు. మద్ది లేరు, సోమవతి నదులు ఉగ్రరూపం దాల్చాయి. దీంతో నీటి ప్రవాహం పోటెత్తింది.
మద్దిలేరు మీద ఉన్న యోగివేమన జలాశయం పూర్తిగా నిండిపోవడంతో 4 గేట్లు ఎత్తివేశారు. చిత్రావతి నాలుగు గేట్లు ఎత్తి 15 వేల క్యూసెక్కులు కిందికి వెళ్తున్నారు. పుట్టపర్తి వద్ద చిత్రావతి నది పూర్తిగా ప్రమాదకరంగా ప్రవహిస్తోంది రాకపోకలు నిలిచిపోయాయి. కదిరి పుట్టపర్తి రహదారిలో వాహనాలను నిలిపివేశారు. ఇదేవిధంగా కదిరి హిందూపురం ప్రధాన రహదారిపై కోనేరు వద్ద నది ఉప్పొంగి ప్రవహిస్తోంది దీంతో రాకపోకలు బంద్ చేశారు. చెరువులన్నీ ప్రమాదకర స్థితిలో పారుతున్నాయి. చెరువు సమీపంలో ఉన్న ఇళ్లల్లోకి నీరు రావడంతో తట్టా బుట్టా సర్దుకుని పునరావాస కేంద్రాలకు పరుగులు పెడుతున్నారు. ఓబులదేవర చెరువు మండల కేంద్రంలో ఉన్న చెరువు.. నీటి పోటుకు ఇళ్లల్లోకి చేరాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..