Wednesday, September 18, 2024

Yemmiganur – మహారాష్ట్ర గ్యాంగ్ అరెస్టు…

ఎమ్మిగనూరు, అర్బన్ 9,(ప్రభన్యూస్).గురు రాఘవేంద్ర ఎత్తిపోతల పంపుహౌస్ పంపుసెంట్లును పగలగొట్టి అందులో లక్షలాది రూపాయల విలువ చేసి రాగి వైరు,ప్లేట్లు,ఆయిల్ ను దొంగలించిన మహారాష్ట్ర కు చెందిన గ్యాంగ్ ను ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు సోమవారం ఎమ్మిగనూరు రూరల్ సిఐ కార్యాలయంలోఎమ్మిగనూరు

ఇంచార్జి డీఎస్పీ శ్రీనివాసాచారి,ఎమ్మిగనూరు రూరల్ సిఐ విక్రమ్ సింహా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నందవరం,మంత్రాలయం,కోసిగి పరిధిలోని గురురాఘవేంద్ర ఎత్తిపోతల పథకం కింద తుంగభద్ర నది ఒడ్డున ఏర్పాటు చేసిన లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం పంపుహౌస్ దగ్గర పంపుసేట్లు ను పగలగొట్టి విలువైన రాగి వైరు,రాగి పేట్లు,ఆయిల్ ను దొంగిలించిన మహారాష్ట్ర కు చెందిన గ్యాంగ్ లో మొత్తం ఏడుగురు లో ముగ్గురిని ఆదివారం సాయంత్రం నందవరం నాగలదిన్నె దగ్గర తుంగభద్ర నదిపై బ్రిడ్జి పైన పోలీసు సిబ్బంది తో కిరణ్,కరీ ముద్దీన్,జహీర్ లను అదుపులోకి తీసుకొని వారి నుండి ఐషర్ మినిలారీ,జీపు,ఇరవై ఐదు కేజీల కాపర్ వైరు, తొమ్మిదు లక్షల నగదును స్వాధీనం చేసుకోవడం జరిగిందని వారు తెలిపారు

- Advertisement -

. అలాగే ఇదే గ్యాంగ్ పై మంత్రాలయంలో-3, నందవరంలో-3, కోసిగి లో-1,డోన్ లో-1,వైఎస్సార్ కడపజిల్లాలో-1 కేసులు నమోదయ్యాయి అని డీఎస్పీ తెలిపారు.ప్రభుత్వ నిధులు, రైతులకు సాగునీరు ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఎమ్మిగనూరు ఇంచార్జి డీఎస్పీ అధ్వర్యంలో కర్నూలు స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ ప్రసాద్, సెంట్రల్ క్రైమ్ స్టేషన్ ఇన్స్పెక్టర్ శేషయ్య,సైబర్ సెల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు వారి నేతృత్వంలో ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి కేసులో వారు దొంగలను గుర్తించారు.

దొంగతనం కోసం మరోసారి ఇక్కడికి వస్తున్నారని ఫోన్ లొకేషన్ ఆధారంగా వారిని అరెస్టు చేయడం జరిగింది. మరో నలుగురు పరారీలో ఉన్నట్లు వారు తెలిపారు. కేసు చేదించిన పోలీసు సిబ్బందికి ఎస్పీ అభినందనలు తెలుపుతూ రివార్డులు ఇవ్వడం జరిగిందని వారు అన్నారు.అలాగే నందవరం,మంత్రాలయం,కోసిగి రైతులు కూడా పోలీసులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

కార్యక్రమంలో నందవరం ఎస్ఐ శ్రీనివాసులు తదితర పోలీసులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement