Monday, November 25, 2024

Yelllow festival – నేటి నుంచి రాజమహేంద్రవరంలో టీడీపీ మహానాడు

రాజమహేంద్రవరం. – (మహానాడు ప్రాంగణం నుంచి ఆంధ్రప్రభ బృందం) – తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడుకు చారిత్రాత్మక నగరం రాజమండ్రి ముస్తాబైంది. నగరంలో ఏ మూల చూసినా పసుపు దనమే కనిపి స్తోం ది. ఎక్కడ చూసినా ఎన్‌టిఆర్‌ చంద్ర బాబుల కటౌట్‌లు, బ్యానర్లతో నగరం పసుపు మయ మైంది. రాజమండ్రితో తెలుగుదేశం పార్టీకి ప్రత్యేక సెంటిమెంట్‌ ఉంది. 1994 ఎన్నికలకు ముందు దివంగత ఎన్‌టిఆర్‌ ప్రత్యేకంగా రాజమండ్రిని ఎంచుకుని మరీ ఇక్కడ భారీ ఎన్నికల ప్రచార సభను నిర్వహిం చారు. ఆ సభ నుంచే శంఖారావం పూరించా రు. 1994ఎన్నికల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం ఘన విజయం సాధించింది. విపక్షాల్ని మట్టికరిపించింది. ఈ సారి ఎన్నిక లకు ముందు చంద్రబాబు రాజమం డ్రిని మహానాడుకు వేదికగా ఎంచుకున్నారు. ఈ వేదిక నుంచే ఆయన 2024ఎన్నికల ఢంకా భ జాయించనున్నారు.

గోదావరి జిల్లాల్లో ఎక్కు వ స్థానాలు గెల్చిన పార్టీ రాష్ట్రంలో అధికా రంలోకి రావడం సంప్రదాయంగా సాగు తోంది. అందుకే ఈ సారి చంద్రబాబు ఈ జిల్లా లపై ప్రత్యేక దృష్టిపెట్టారు. రెండు ఉమ్మడి గోదావరి జిల్లాలకు కేంద్రంగా ఉన్న రాజమం డ్రి నుంచి ఆయన పూరించే సమర శంఖం రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ శ్రేణుల్ని ఉత్తేజి తుల్ని చేసేలా ఇక్కడ ఏర్పాట్లు జరుగుతు న్నా యి. శని, ఆదివారాల్లో ఈ మహానాడు నిర్వహి స్తున్నారు. శనివారం 15వేల మంది ప్రతిని ధుల్తో సభ జరుగుతుం ది. అదే రోజు పార్టీ జాతీయాధ్యక్షుని ఎన్నిక నిర్వహిస్తారు. రెండో రోజు పార్టీ పలు తీర్మానాల్ని ప్రవేశపెడ తుంది. ఈ తీర్మానాలపై శుక్రవారంజరిగిన పోలిట్‌ బ్యూరోలో విస్తృతంగా చర్చించారు. ఈ తీర్మా నాల ద్వారానే రానున్న ఎన్నికల్లో టీడీపీ మేనిఫెస్టో రూపకల్పనకను గుణంగా ఉండ ను న్నాయి.

ఈ తీర్మానాల ద్వారా ఎన్నికల్లో తమ ను గెలిపిస్తే రాష్ట్రంలో చేపట్టబోయే సంక్షేమ, అభివృద్ది కార్యక్ర మాల్ని తెలుగుదేశం వివరించనుంది. అదే రోజు అంటే ఆదివారం సాయంత్రం పార్టీ వ్యవస్థాపకులు నంద మూరి తారకరా మారా వు శతజయంతి ఉత్సవ ముగింపు మహాస భను రాజమం డిలో నిర్వహిస్తున్నారు. దీనికి 15లక్షల మంది హాజరౌతారని అంచనాలేసు ్తన్నారు. ఇందు కనుగుణంగా ఇప్పటికే ఏర్పా ట్లు పూర్త య్యాయి. ఈ నగరంలోని జాతీయ రహదారి వెంబడి వేమగిరి వద్ద 38ఎకరాల సువిశాల ప్రాంగణంలో మహానాడు నిర్వహణకు వేది కను సిద్దం చేశారు. దివంగత దర్శకుడు ఇవివి సత్యనారాయణ కొడుకు ఆర్యన్‌ రాజేష్‌కు చెందిన ఎనిమిదెకరాల సువిశాల ప్రాంగ ణంలో మహానాడు ప్రతినిధుల సభను నిర్వహిస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నానికే మహానాడు వేదిక సిద్దమైంది. ఎండ, వానల్ని తట్టుకునే భారీ టెంట్లను ఇక్కడ ఏర్పాటు చేశా రు.

- Advertisement -

జాతీయ, రాష్ట్ర స్తాయి కమిటీల సభ్యులకు వేరుగా, జిల్లా, మండల స్థాయి సభ్యులకు వేర్వేరుగా సీటింగ్‌ ఏర్పాటు చేశారు. అలాగే మీడియాకు, విఐపిలకు ప్రత్యేక గ్యాలరీలు సిద్దం చేశారు. ఎన్‌టిఆర్‌ కుటుంబ సభ్యుల కోసం అదనపు ఏర్పాట్లు జరిపారు.శుక్రవారం సాయంత్రానికే పార్టీ జాతీ యాధ్యక్షుడు చంద్రబాబునాయు డు, ప్రధా న కార్యదర్శి లోకేష్‌ రాజమండ్రికి విచ్చేశా రు. అంతకు ముందే పార్టీ నాయకులంతా ఇక్కడకు చేరా రు. పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నా యుడు మూడ్రోజుల క్రితమే ఇక్కడికొచ్చే ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి పార్టీ నాయకుల సమన్వయ ఏర్పాట్లను చూస్తున్నారు. గోదావరి జిల్లాలంటేనే ఆప్యాయతకు పెట్టిం ది పేరు. ఈ సభలకొచ్చే ఆహుతులు జీవితాం తం గుర్తుంచుకునే రీతిలో ఇక్కడ భోజన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రాంతంలో లభించే ప్రత్యేక పండ్లతో పాటు ఇక్కడ ప్రసిద్ది గాంచిన పలురకాల వంటల్ని కూడా సిద్దం చేస్తున్నారు. ఆప్యాయంగా వడ్డించేందుకు తెలుగుదేశం శ్రేణుల్లోని ఆసక్తిపరుల్ని ఎంపిక చేసింది. ఏ ఒక్కరు ఇక్కడి ఏర్పాట్ల పట్ల అసంతృప్తి వ్యక్తం చేయలేని రీతిలో మాజీమంత్రి నిమ్మకా యల చినరాజప్ప ఈ ఏర్పాట్లను పర్యవేక్షిసు ్తన్నారు.
కాగా ఈ కార్యక్రమానికి సుమారు 3వేల మంది పోలీసులు భద్రతా ఏర్పాట్లలో నిమగ్న మయ్యారు. చంద్రబాబు ఎస్‌పిజి భద్రతా వలయంలో ఉండే నాయకుడు. అలాగే హాజరౌతున్న పలువురి నాయకులక్కూడా భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. ప్రతి ఒక్కర్ని తనిఖీ చేసిన తర్వాతే లోనికనుమతిస్తారు. అలాగే ప్రాంగణానికి దారితీసే రహదా ర్లన్నింటిపైన నిఘా పెట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement