Tuesday, November 26, 2024

మొన్న ధ్వ‌జస్తంభం.. నేడు చౌదమ్మతల్లి విగ్రహం

యల్లనూరు (ప్రభన్యూస్): భారీ ఈదురు గాలులకు పాతపేట శివారులోని శివాలయం ముందున్న ద్వజస్తంభంపై ఉన్న నాలుగు కోళ్ల స్తంభం కింద పడి ముక్కలైన సంఘటన చోటు చేసుకుంది.ఆ సంఘటనలో అక్కడ ఎవరు లేకపోవ‌డంతో ఎటువంటి ప్రమాదం జరగలేదు. కాగా ఈ సంఘటన జరిగి మూడు రోజులు గడవక ముందే అదే ప్రాంతంలో వున్న పురాతన చౌడమ్మ తల్లి విగ్రహం నెలకొరిగి మూడు ముక్కలు అయ్యింది.దీంతో గ్రామంలో ఒక్కసారిగా గ్రామానికి ఏదో అరిష్టం జరిగింది అంటూ పెద్దలు చర్చించుకుంటుంటే ..ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.గ్రామ పెద్దల సమక్షంలో చందాలు వసూలు చేసి 100సంవత్సరాల క్రితం ప్రతిష్టించిన చౌదమ్మ అమ్మవారిని కదల్చకుండా నవధాన్యాలతో నింపి..దేవాలయ నిర్మాణానికి గ్రామ పెద్దలు పూనుకొని అమ్మవారి గర్భ గుడి కప్పు నిర్మాణం పూర్తి చేసారు.కప్పు నిర్మాణ అనంతరం అమ్మవారి విగ్రహం కప్పిన వున్న నవధాన్యాలను తొలగించి అమ్మవారు కనిపించేటట్లు చేశారు. అందులో ఏమి లోపం జరిగిందో లేక అమ్మవారు ఆగ్ర‌హించిందేమో.. ఇంతలోనే ఆ విగ్రహం కింద పడి మూడు ముక్కలు అయ్యింది. దీంతో ప్రజలు బేంబేలెత్తు తున్నారు. అమ్మవారిని సంతోషపెట్టేందుకు గుడి నిర్మాణాన్ని పూర్తి చేసే దాతలు ఎవరైనా ముందుకు వస్తారేమో నని కళ్ళ లో ఒత్తులు పెట్టుకొని చూస్తున్నారు. అమ్మవారు విగ్ఱ‌హం కింద పడిందని తెలిసి చుట్టూ ప్రక్కల గ్రామాల ప్రజలు చూడ‌టానికి తండోప‌తండాలుగా వ‌స్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement