Friday, November 22, 2024

YCP – పాలిటిక్స్‌లోకి వీవీ వినాయ‌క్ – ఏలూరు బరిలో దిగేందుకు రెడీ

వైసీపీ అధిష్టానం మంతనాలు
ఇంకా పెదవి విప్పని దర్శక వీరుడు
రాజ‌కీయ వ‌ర్గాల్లో ఇదే చ‌ర్చ‌
ప‌శ్చిమ జిల్లావాసి కావ‌డం క‌లిసొచ్చే అంశం
కాపు సామాజిక వ‌ర్గ‌మూ మ‌రో అనుకూలం
కొత్త ప్ర‌యోగానికి తెర‌దీస్తున్న వైసీపీ

ఏలూరు బ్యూరో (ప్రభ న్యూస్)
అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తున్న రాజకీయ పార్టీలు కేవలం రాజకీయ రంగంలో సక్సెస్ సాధించిన వారినే కాదు.. వివిధ రంగాల్లో ప్రజాదరణ కలిగిన ప్రముఖులనూ రంగంలోకి దించి, ఏ విధంగానైనా విజయం సాధించడమే లక్ష్యంగా తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. తాజాగా .తెలుగుచిత్ర పరిశ్రమలో అగ్రశ్రేణి దర్శకుడిగా పేరు గడించిన వి.వి.వినాయక్ ను రాజకీయ రంగంలోకి దించనున్నట్లు విస్తృత ప్రచారం జరుగుతోంది. ఐతే, రాజకీయాల్లోకి ఆయన వచ్చేది లేదని వీవీ వినాయ్ వర్గం చెబుతోంది. వైసీపీ ఎంపీ అభ్యర్థిగా ఏలూరు బరిలోకి రానున్నట్లు జరుగుతున్న విస్తృత ప్రచారం రాజకీయవర్గాల్లో ఆసక్తిని రేపింది. ఆది సినిమాతో తొలి ప్రయత్నంలోనే టాప్ రేంజ్ వెళ్లిన‌ దర్శకుడు వీవీ వినాయక్‌ను ఏలూరు ఎంపీ అభ్యర్థిగా రంగంలోకి దించాలని వైసీపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సంప్రదింపులు కూడాజరిపినట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా నివాసి కావడం జిల్లాలో బలమైన కాపు సామాజిక వర్గానికి చెందతటంతో.. వినాయక్ ని రంగంలోకి దించేందుకు అధికార వైసీపీ విశ్వ ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. ఏలూరు పార్లమెంట్ సిట్టింగ్ ఎంపీ కోటగిరి శ్రీధర్ స్వచ్ఛందంగానే తాను ఈసారి ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గానికి పోటీ చేయబోనని తేల్చి చెప్పిన నేపథ్యంలో ఇక్కడ కొత్త అభ్యర్థిని రంగంలోకి దించాల్సిన పరిస్థితి నెలకొంది.

అభ్యర్థుల వేటలో వైసీపీ
ఈ నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ పేరు పరిశీలనకు వచ్చింది. వినాయక్ సన్నిహితులు పార్టీ వర్గాలు వినాయక్ పేరును తెరపైకి తెచ్చారు వినాయక్ పూర్తి పేరు గంట్రోతు వీర వెంకట వినాయకరావు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని చాగల్లు స్వగ్రామం 2002లో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ఆది సినిమాకు తొలిసారి దర్శకత్వం వహించారు. తొలిచిత్ర ఉత్తమ దర్శకుడిగా రాష్ట్ర నంది అవార్డును దక్కించుకున్నారు.ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గం 1952లో ఏర్పడ్డాక రెండుసార్లు కమ్యూనిస్టులు 9సార్లు కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థులు నాలుగు సార్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ప్రస్తుతం వైసీపీ అభ్యర్థి గెలిచారు ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ శ్రీధర్ వెలమ సామాజిక వర్గం. ఈయన తండ్రి కోటగిరి విద్యాధరరావు రాజకీయ రంగంలోని పేరు ప్రతిష్టలు, వైసీపీ ప్రభంజనంతో శ్రీధర్ గెలిచారు. .ఈసారి ఎన్నికల్లో ఏలూరు పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేసేందుకు శ్రీధర్ ఆసక్తి కనపరచకపోవడంతో ఈ నియోజకవర్గంలో కొత్త అభ్యర్థిని బరిలోకి దించడం అని వార్యమైంది

ఒక కొత్త ప్రయోగం

వినాయక్ పోటీకి సమ్మతిస్తే ఏలూరు మచిలీపట్నం లేదా కాకినాడ పార్లమెంటు నియోజకవర్గం నుంచి బరిలోకి దించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. ప్రధానంగా పశ్చిమగోదావరి జిల్లా వినాయక్ సొంత జిల్లా కావడంతోను ఆయన మిత్రులు బంధువులు సన్నిహితులు సైతం ఇదే జిల్లాలో ఉండడం తో ఏలూరు పార్లమెంట్ నుంచి పోటీకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి పైగా ప్రస్తుతం గోదావరి జిల్లాలో అత్యధికంగా ఉన్న కాపు సామాజిక వర్గం జనసేన పవన్ కళ్యాణ్ ప్రభావాన్ని తట్టుకొని పోటీకి నిలబడే దీటైన కాపు అభ్యర్థులని నిలిపి సునాయాసంగా గెలిచేందుకు తగిన అభ్యర్థుల్ని పోటీకి దించాలని వైసీపీ ఆలోచన .

Advertisement

తాజా వార్తలు

Advertisement