ఏపీ న్నికలకు ముందే పార్టీల మధ్య యుద్ధం మొదలైంది. టీడీపీ, జనసేన వర్సస్ అధికార వైఎస్సార్సీపీ మధ్య నెట్టింట పోస్టర్ వార్ మొదలైంది. షారూక్ నటించిన ‘డంకీస చిత్ర పోస్టర్‌ను వాడుకుని ఇరు పార్టీలు రాష్ట్రం నుంచి వెళ్లిపోవడానికి సిద్ధంగా ఉన్నారంటూ ట్విట్టర్‌లోని తమ అధికారిక హ్యాండిళ్లలో పోస్ట్ చేశాయి.
టీడీపీ ముందుగా డంకీ పోస్టర్‌ను వైసీపీ నేతల ముఖాలతో మార్ఫింగ్ చేసి ట్విట్టర్ హ్యాండిల్లో పోస్ట్ చేసింది. దీని క్యాప్షన్‌గా ‘2024 ఎన్నికల ఫలితాలకు ముందే సైకో వైకాపా బ్యాచ్ అంతా విదేశాలకు పారిపోవడానికి లగేజీ సర్దుకుంటున్నారు.’ అని రాసుకొచ్చింది. ఈ పోస్టర్లో JUMPI-AFTER 2024 Elections అని టైటిల్‌ను యాడ్ చేసింది టీడీపీ.
దీనికి కౌంటర్ గా,
వైసీపీ కూడా టీడీపీ నేతల ముఖాలతో డంకీ పోస్టర్‌ను ట్విట్టర్ హ్యాండిల్లో పోస్ట్ చేసింది. దీని క్యాప్షన్‌గా.. ‘పేదలకు జగనన్న ప్రభుత్వం చేస్తున్న మంచిని అడ్డుకుంటున్న ఈ పచ్చ హమాస్ బ్యాచ్ మన రాష్ట్రం నుంచి తరలిపోయే రోజు త్వరలోనే రానుంది.’ అని రాసుకొచ్చింది. ఈ పోస్టర్లో ‘JUMPING JAPANG’ అని టైటిల్‌ను యాడ్ చేసింది వైసీపీ. ఈ పోస్టర్‌పై నారా లోకేష్, రామోజీ రావు, చంద్రబాబు, నాదెండ్ల మనోహర్, పవన్ కళ్యాణ్ ముఖాలను చేర్చింది. ఈ పోస్టర్లు రెండు వైరల్ గా మారాయి..